MLA Mahipal Reddy : BRS ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు
పటాన్‌చెరు BRS ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు చేస్తోంది. అతడి సోదరుడు మధుసూదన్‌రెడ్డి నివాసంలోనూ.. ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి పటాన్‌చెరులోని మూడు ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి.

ED searches house of BRS MLA Mahipal Reddy
పటాన్‌చెరు BRS ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు చేస్తోంది. అతడి సోదరుడు మధుసూదన్‌రెడ్డి నివాసంలోనూ.. ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి పటాన్‌చెరులోని మూడు ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. కాగా ఇద్దరు సోదరులు మైనింగ్ తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. గతంలో లగ్డారం గనుల వ్యవహారంలో స్థానిక పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ కేసు నేపథ్యంలోనే ఈడీ తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం.. ఒక కేసులో గూడెం మధు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.. కాగా ప్రస్తుతం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. ఈడీ సోదాల విషయం ఆనోట ఈనోట పడి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.