Chiru pawan : తమ్ముడు కోసం రంగంలోకి అన్నయ్య…
పవర్ స్టార్ (Power Star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అటు సినిమాలు, ఇటు రాజకీయాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైసీపీ (YCP) ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న లక్ష్యంతో పవన్ ప్రస్తుతం పని చేస్తున్నారు.

Elder brother in the field for younger brother
పవర్ స్టార్ (Power Star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అటు సినిమాలు, ఇటు రాజకీయాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైసీపీ (YCP) ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న లక్ష్యంతో పవన్ ప్రస్తుతం పని చేస్తున్నారు. దీని కోసం పవన్ ప్రస్తుతం కొద్దిరోజులు షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చారు. పూర్తిగా ఎన్నికల ప్రచారానికే టైం కేటాయిస్తున్నారు. ఇక గత ఎన్నికలో ఘోర పరాజయం పాలైన పవన్ కళ్యాణ్.. ఈ సారి మారి పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తున్నాడు. జనసైనికులతో పాటు మెగా ఫ్యామిలీ సైతం పవన్ కళ్యాణ్ కోసం ప్రచారానికి సిద్దంగా ఉన్నారు. నిన్ననే యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో వరుణ్ తేజ్ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం లో ప్రచారం మొదలు పెట్టగా మెగా అభిమానులు మరింత మంది స్టార్ హీరోలు మెగా కుటుంబం నుంచి వస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ (Megastar) చిరు ప్రచారానికి సంబంధించిన లేటెస్ట్ బజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా పిఠాపురం (Pithapuram) లో మెగా ఫ్యామిలీ ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. మే 5న నియోజకవర్గంలో మెగాస్టార్ చిరంజీవి ప్రచారంలో పాల్గొననున్నట్లు కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది. పవన్‌కు ఇప్పటి వరకు బహిరంగంగా మద్దతు ప్రకటించని చిరు.. రీసెంట్‌గా కూటమికే నా మద్దతు అంటూ ఓ వీడియో విడుదల చేయడం సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో.. చిరు పవన్ కుమద్దతుగా ప్రచారంలోకి దిగబోతున్నట్లు ఓ టాక్ వినిపిస్తోంది. రాంచరణ్ కూడా ప్రచార రంగంలోకి దిగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మెగా బ్రదర్ నాగబాబు క్లారిటీ ఇచ్చారు.
కళ్యాణ్ బాబుకు మద్దతుగా సాయి ధరమ్ తేజ్ (Sai Dharam), వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) లు అయితే వస్తారని కానీ అన్నయ్య చిరు వస్తారో లేదో ఇంకా తెలీదని నాగబాబు తెలిపారు. ప్రస్తుతం చిరు “విశ్వంభర” షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిరు రావచ్చు రాకపోవచ్చు అనే హింట్ ని అయితే నాగబాబు (Naga Babu) అందించారు. కాగా.. మెగా మేనల్లుళ్లు సాయి ధరమ్, వైష్ణవ్ తేజ్ సైతం మేనమామ పార్టీ కోసం ఎక్కడి వెళ్లడానికైనా, ఏది చేయడానికైనా సిద్దంగా ఉంటామని తరచూ చెబుతూనే ఉంటారు. ఇప్పటికే మొత్తానికి ఏది ఏమైనా పవన్ కోసం మెగా ఫ్యామిలీ మొత్తం ఏకమవుతున్నట్టు కనిపిస్తోంది.