AP PENSIONS: ఇది ఎవరి పాపం? ఫించన్‌ కోసం వెళ్లి ఇద్దరు మృతి..

ఎట్టకేలకు ఇవాళ ఫించన్లు పంచడం ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. కానీ అదే.. ఇద్దరు వృద్ధుల పాలిట మృత్యువుగా మారింది. పింఛన్ల కోసం క్యూలో నిలబడి ఎండదెబ్బ తగలడంతో ఇద్దరు వృద్ధులు చనిపోయారు. ఉదయం నుంచి లబ్ధిదారులు సచివాలయాల వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీరారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 3, 2024 | 08:24 PMLast Updated on: Apr 03, 2024 | 8:24 PM

Elder People Died In Ap For Went For Pensions To Sachivalayam

AP PENSIONS: ఏపీలో ఫించన్ల విషయంలో జరుగుతున్న రాజకీయ హంగామా అంతా ఇంతా కాదు. టీడీపీనే ఫించన్లు ఆపించిందని వైసీపీ.. సచివాలయ సిబ్బందితో ఫించన్లు పంచాలంటూ టీడీపీ.. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఎట్టకేలకు ఇవాళ ఫించన్లు పంచడం ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. కానీ అదే.. ఇద్దరు వృద్ధుల పాలిట మృత్యువుగా మారింది. పింఛన్ల కోసం క్యూలో నిలబడి ఎండదెబ్బ తగలడంతో ఇద్దరు వృద్ధులు చనిపోయారు.

AP PENSIONS: టిడిపి సెల్ఫ్ గోల్.. దెబ్బ కొట్టనున్న పెన్షనర్లు

ఉదయం నుంచి లబ్ధిదారులు సచివాలయాల వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీరారు. పింఛన్ల కోసం ఎదురు చూశారు. ఈ క్రమంలోనే ఎండ వేడిమికి తాళలేక తిరుపతి, కృష్ణాజిల్లాలో ఇద్దరు వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లా గంగూరులో 80 ఏళ్ల వజ్రమ్మ అనే వృద్ధురాలు వడదెబ్బ తగిలి చనిపోయింది. పింఛన్ కోసం ఉదయం నుంచి ఎదురుచూసిన వజ్రమ్మ.. ఎండదెబ్బకు తాళలేక అస్వస్థతకు గురైనట్లు స్థానికులు చెప్తున్నారు. ఇక సూళ్లూరుపేటలో లలితమ్మ అనే వృద్ధురాలు ఫించన్‌ కోసం ఎదరుచూస్తూ కళ్లు తిరిగి పడిపోయింది. ఆస్పత్రికి తరలించేలోగానే చనిపోయింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు పింఛన్ కోసం ఉదయమే సచివాలయాల వద్దకు చేరుకున్నారు. సచివాలయాల వద్ద బుధవారం నుంచి పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు.. అంటే ఏప్రిల్ 6 వరకూ పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. అనారోగ్యంతో ఉన్నవారు, దివ్యాంగులు, వితంతువులకు ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ చేస్తారని చెప్పింది.

సచివాలయాల్లో సిబ్బంది సంఖ్య తక్కువగా ఉన్న కారణంగా మిగతా లబ్ధిదారులు సచివాలయాల వద్ద తీసుకోవాలని సూచించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల వద్దకు పింఛన్ దారులు క్యూ కట్టారు. బ్యాంక్‌ నంచి డబ్బులు విత్‌డ్రా చేయడం లేట్‌ అవ్వడంతో కొన్ని ప్రాంతాల్లో ఫించన్ల పంపిణీ మధ్యాహ్నం ప్రారంభమైంది. అలాంటి ప్రాంతాల్లో వృద్ధలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే ఇద్దరు చనిపోయారు. మరో మూడు రోజుల పాటు ఫించన్ల పంపిణీ కొనసాగబోతోంది. ఇప్పుడైనా అధికారులు సరైన ఏర్పాట్లు చేస్తారా లేక ఇలాంటి ఘటనలే మళ్లీ జరుగుతాయా చూడాలి.