TELANGANA: తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. అనుమతించిన ఈసీ..

ఇప్పటివరకు డీఏల చెల్లింపు ఎందుకు ఆలస్యమైందని.. ఇప్పుడే ఎందుకు ఇస్తున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని ఈసీ ప్రశ్నించింది. గతంలో డీఏల చెల్లింపు జరిగే విధానాలపై కూడా ఆరా తీసింది. మరోవైపు డీఏ విడుదలపై ఉద్యోగ సంఘాలు కూడా స్పందించాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 2, 2023 | 08:02 PMLast Updated on: Dec 02, 2023 | 8:02 PM

Election Commission Allowed Govt To Release Employees D A

TELANGANA: తెలంగాణ ఉద్యోగులకు ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ అందించింది. కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభత్వానికి అనుమతించింది. ఉద్యోగులకు మూడు డీఏలు పెండింగ్‌లో ఉండగా.. ఒక డీఏ విడుదలకు అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఈసీని విజ్ఞప్తి చేసింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య సంప్రదింపులు జరిగాయి. ఈ అంశంపై ఈసీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

BARRELAKKA: బర్రెలక్కకు ఎన్ని ఓట్లు రాబోతున్నాయి? ఇది ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

ఇప్పటివరకు డీఏల చెల్లింపు ఎందుకు ఆలస్యమైందని.. ఇప్పుడే ఎందుకు ఇస్తున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని ఈసీ ప్రశ్నించింది. గతంలో డీఏల చెల్లింపు జరిగే విధానాలపై కూడా ఆరా తీసింది. మరోవైపు డీఏ విడుదలపై ఉద్యోగ సంఘాలు కూడా స్పందించాయి. డీఏకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఉద్యోగ సంఘాలు కూడా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వారా ఈసీకి తమ విజ్ఞప్తి చేశాయి. నిజానికి డీఏ ఎప్పుడో విడుదల కావాలి. కానీ, అసెంబ్లీ ఎన్నికల కారణంగా నిలిచిపోయింది. దీంతో అన్ని అంశాలు పరిశీలించిన ఈసీ.. పోలింగ్ ముగిసిన నేపథ్యంలో డీఏ విడుదలకు తాజాగా అనుమతిచ్చింది. ఒక డీఏ విడుదలకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంది. దీంతో ప్రభుత్వం ఉద్యోగులకు డీఏను విడుదల చేయనుంది.