Election Commission: ఏపీపై ఈసీ స్పెషల్ ఫోకస్.. రాష్ట్రానికి మరో ముగ్గురు అధికారులు..
ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు ప్రత్యేక అధికారుల్ని నియమించింది. రామ్ మోహన్ మిశ్రా, దీపక్ మిశ్రా, నీనా నిగమ్ అనే ముగ్గురు రిటైర్డ్ సివిల్స్ అధికారులను భారత ఎన్నిక సంఘం నియమించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
Election Commission: దేశమంతా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నా.. ఏపీపై స్పెషల్ ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. పైగా ఈసారి పార్టీల మధ్య హోరాహోరీ పోరు కనబడుతోంది. మరోవైపు ఏపీలో వైసీపీ.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు ప్రత్యేక అధికారుల్ని నియమించింది.
KTR TWEET: కేటీఆర్‌కి దిమ్మతిరిగే షాక్.. చెల్లెలు తిహార్ జైల్లో ఉంటే.. IPL ఎంజాయ్ చేస్తున్నావా..?
రామ్ మోహన్ మిశ్రా, దీపక్ మిశ్రా, నీనా నిగమ్ అనే ముగ్గురు రిటైర్డ్ సివిల్స్ అధికారులను భారత ఎన్నిక సంఘం నియమించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ ముగ్గురు ప్రత్యేక పరిశీలకులుగా వ్యవహరిస్తారు. వీరిలో రామ్ మోహన్ మిశ్రా 1987 బ్యాచ్‌కి చెందిన రిటైర్డు ఐఏఎస్ అధికారి. ఆయన స్పెషల్ జనరల్ అబ్జర్వర్‌గా పని చేస్తారు. దీపక్ మిశ్రా 1984 బ్యాచ్‌కి చెందిన రిటైర్డు ఐపీఎస్ అధికారి. ఆయన స్పెషల్ పోలీస్ అబ్జర్వర్‌గా కొనసాగుతారు. నీనా నిగమ్ 1983 బ్యాచ్‌కు చెందిన రిటైర్డు ఐఆర్ఎస్ అధికారిణి. ఆమె.. ఈ ఎన్నికల్లో స్పెషల్ ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్‌గా పని చేస్తారు. ఈ ముగ్గురి నియామకపై ఈసీఐ నుంచి సమాచారం అందిందని ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఈ ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు నేడు ఢిల్లీలోని భారత ఎన్నికల సంఘం కార్యాలయంలో జరిగే సమావేశానికి హాజరవుతున్నారు. వచ్చే వారం నుంచి పూర్తి స్థాయిలో రాష్ట్రంలో పర్యటించి, ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలో చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను పరిశీలిస్తారు. అలాగే ఎన్నికల నిర్వహణలో ఈసీ మార్గదర్శకాలను పటిష్టంగా అమలయ్యేలా చూస్తారు.
రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, సమస్యాత్మకమైన ప్రాంతాలతో పాటు ఓటర్లను ఆకర్షించే తాయిలాల నియంత్రణపై కూడా ఈ పరిశీలకులు ప్రత్యేక దృష్టి పెడతారు. ఇప్పటికే ఏపీలో ఎన్నికల కోడ్ అమలవుతున్నప్పటికీ.. తాయిలాలు ఇచ్చేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ఓటర్లకు పంచేందుకు అధికార పార్టీ నేతలు సిద్ధం చేసిన వాటిని అధికారులు పట్టుకుంటున్నారు. ఇక వాలంటీర్లను వైసీపీ నేతలు వినియోగించుకుంటున్నాయని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. దీంతో అధికారపార్టీపై విపక్షాలు పలు ఫిర్యాదులు చేస్తున్నాయి. మరి కొత్తగా వచ్చిన అధికారులతో ఎన్నికలు నిబంధనలకు అనుగుణంగా జరుగుతాయేమో చూడాలి.