EC ON AP ELECTIONS: ఏపీలో ఈసీ కొరడా.. ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీ..
బదిలీ అయిన అధికారులు ఎన్నికలు పూర్తయ్యే వరకూ విధుల్లో ఉండకూడదని స్పష్టం చేసింది. బదిలీ అయిన అధికారులు మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు తమ కింది వారికి బాధ్యతలు అప్పగించి తప్పుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
EC ON AP ELECTIONS: ఏపీలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్, ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు వేసింది. ముగ్గురు ఐఏఎస్‌లతోపాటు, ఆరుగురు ఐపీఎస్‌లను బదిలీ చేసింది.
PHONE TAPPING: ఫోన్‌ట్యాపింగ్ కేసులో ముందడుగు.. కీలక ఆధారాలు స్వాధీనం
గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అంబురాజన్, నెల్లూరు ఎస్పీ కె.తరములేశ్వర్ రెడ్డిని బదిలీ చేస్తూ ఈసీ ఆదేశాలిచ్చింది. అలాగే ఐఏఎస్ అధికారుల్లో కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి రాజబాబు, గౌతమి (అనంతపురం), లక్ష్మీషా (తిరుపతి ) బదిలీ అయ్యారు. బదిలీ అయిన అధికారులు ఎన్నికలు పూర్తయ్యే వరకూ విధుల్లో ఉండకూడదని స్పష్టం చేసింది. బదిలీ అయిన అధికారులు మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు తమ కింది వారికి బాధ్యతలు అప్పగించి తప్పుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. బదిలీ అయిన వారి స్థానంలో కొత్తవారి భర్తీకి ముగ్గురు ఆఫీసర్లతో ప్యానల్ పంపాలని సూచించింది.
ఇటీవల చిలూకలూరిపేటలో ప్రధాని మోదీ పాల్గొన్న బహిరంగసభలో గందరగోళం ఏర్పడింది. అక్కడ విధులు నిర్వర్తించాల్సిన ఎస్పీలు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, సభను విఫలం చేయడానికి ప్రయత్నించారన్న ఆరోపణలు వచ్చాయి. అలాగే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పలు చోట్ల రాజకీయ హింస జరిగింది. ఈ ఘటనలపై సీఈవో నివేదిక రూపొందించి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. ఈ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.