Loksabha Speaker Om Birla : లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా
18వ లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. NDA తరపున ఓంబిర్లా పోటీ చేయగా... ఈసారి INDIA కూటమి తరపున కె.సురేష్ బరిలో నిలిచారు. మొత్తం 297 మంది ఎంపీల మద్దతుతో ఓం బిర్లా గెలిచారు.
18వ లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. NDA తరపున ఓంబిర్లా పోటీ చేయగా… ఈసారి INDIA కూటమి తరపున కె.సురేష్ బరిలో నిలిచారు. మొత్తం 297 మంది ఎంపీల మద్దతుతో ఓం బిర్లా గెలిచారు. మూజువాణి ఓటుతో ఓం బిర్లా గెలిచినట్టు ప్రొటెం స్పీకర్ భర్తృహరి ప్రకటించారు. వరుసగా రెండోసారి లోక్ సభ స్పీకర్ గా ఆయన బాధ్యతలు చేపట్టారు.
ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు కలసి ఓం బిర్లాను స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టారు. రాజస్థాన్ లోని కోటా నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 3 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు ఎంపీగా గెలిచిన ఓం బిర్లా… కోటా లోక్ సభ స్థానం నుంచి హ్యాట్రిక్ కొట్టారు. రెండోసారి స్పీకర్ పదవిని చేపట్టి ఓం బిర్లా చరిత్ర సృష్టించారని అన్నారు ప్రధాని నరేంద్రమోడీ. 2014లో ఓం బిర్లా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనప్పుడు లోక్ సభలో 86శాతం హాజరు నమోదు చేసుకున్నారు. 671 ప్రశ్నలు అడిగారు. 2019లో గెలిచిన తర్వాత అనూహ్యంగా ఓం బిర్లా స్పీకర్ పదవిని దక్కించుకున్నారు.