Lok Sabha Speaker : నేడు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక… ఓటింగ్‌కు దూరం ఏడుగురు ఎంపీలు
లోక్‌సభ స్పీకర్ పదవికి ఇవాళ ఎన్నిక జరగనుంది. 50 ఏళ్ల తర్వాత ఈ పదవి కోసం ఎన్నిక జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరపున ప్రస్తుత స్పీకర్ ఓం బిర్లా మరోసారి పోటీ చేస్తున్నారు.
లోక్‌సభ స్పీకర్ పదవికి ఇవాళ ఎన్నిక జరగనుంది. 50 ఏళ్ల తర్వాత ఈ పదవి కోసం ఎన్నిక జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరపున ప్రస్తుత స్పీకర్ ఓం బిర్లా మరోసారి పోటీ చేస్తున్నారు. అలాగే, ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ ఎంపీ సురేష్ పోటీ చేస్తున్నారు. దీంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మరోవైపు, స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకు చెందిన ఎంపీలందరూ సభకు తప్పనిసరిగా హాజరై తమ మద్దతు తెలియజేయాల్సివుంది. కాగా తొలిసారిగా 1952లో స్పీకర్ పదవికి ఎన్నిక జరిగింది. అందులో శాంతారామ్ (55)పై మౌలాంకర్ (394) విజయం సాధించారు. ఆ తర్వాత 1976లో జగన్నాథ్ రావుపై బలిరామ్ భగత్ 344 ఓట్ల తేడాతో గెలిచారు. ఇప్పుడు మళ్లీ స్పీకర్ పదవికి ఎన్నిక జరుగుతోంది.
ఇప్పటికే ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో లోక్‌సభలో నేడు స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఎన్డీఏకు 293 మంది సభ్యుల మద్దతు ఉంది. వీరికి వైసీపీ సభ్యులు నలుగురు మద్దతు ప్రకటించడంతో ఆ సంఖ్య 297కు పెరిగింది. ఇండియా కూటమికి 233 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉంది. దీంతో స్పీకర్ ఎన్నిక ఏకపక్షంగానే జరిగే అవకాశాలున్నాయి. తమకు సంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వకపోవడంతోనే పోటీకి దిగామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విపక్షాలు చెబుతున్నాయి. కాగా ఎన్డీఏ కూటమి మాత్రం అందుకు అగ్గింకరించలేదు. తీంతో మళ్లీ 50 ఏళ్ల తర్వాత లోక్ సభ స్పీకర్ ఎన్నిక అనివార్యం అయ్యింది.
లోక్‌సభ స్పీకర్ ఎన్నిక.. ఓటింగ్‌కు ఏడుగురు ఎంపీలు దూరం..
నేడు పార్లమెంట్ లో లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. దీంట్లో దేశ వ్యాప్తంగా గెలిచిన ఎంపీలు ఓటింగ్ లో పాల్గొనలి.. ఎంపీలే ఇక్కడ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఏడుగురు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇండియాకు కూటమికి చెందినవారు ఐదుగురు, మరోఇద్దరు స్వతంత్రులు ఉన్నారు. శశిథరూర్, శత్రుఘ్నసిన్హా లాంటి ప్రముఖులు ప్రమాణ స్వీకారం చేయలేదు. లోక్‌సభ సభ్యులుగా ప్రమాణం చేయనివారు స్పీకర్ ఎన్నికలో ఓటింగ్‌కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. దీంతో స్పీకర్ ఎన్నికపై వీరి ప్రభావం చూపెట్టనుందా అనే చర్చ నడుస్తోంది.