మరికొన్ని గంటల్లో ఎలక్షన్ రిజల్ట్.. తెలంగాణ తీర్పు ఎలా ఉండబోతోంది..
తెలంగాణ ఎన్నికల ఫలితాలు రావడానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ప్రధాన పార్టీలకు ఎవరి అంచనాలు వారికున్నాయి. 70కి పైగా సీట్లు వస్తాయని బీఆర్‌ఎస్ అంటోంది. అధికారంలోకి వచ్చేది తామేనని కాంగ్రెస్ ధీమాగా ఉంది. తెలంగాణలో కింగ్ మేకర్‌గా మారబోతున్నామని బీజేపీ చెప్తోంది. ఇందులో.. డిసెంబర్ 3న ఎవరి అంచనాలు నిజమౌతాయి? ఓటర్లు తీర్పు ఎలా ఉంది?
తెలంగాణ ఎన్నికల ఫలితాలు రావడానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ప్రధాన పార్టీలకు ఎవరి అంచనాలు వారికున్నాయి. 70కి పైగా సీట్లు వస్తాయని బీఆర్‌ఎస్ అంటోంది. అధికారంలోకి వచ్చేది తామేనని కాంగ్రెస్ ధీమాగా ఉంది. తెలంగాణలో కింగ్ మేకర్‌గా మారబోతున్నామని బీజేపీ చెప్తోంది. ఇందులో.. డిసెంబర్ 3న ఎవరి అంచనాలు నిజమౌతాయి? ఓటర్లు తీర్పు ఎలా ఉంది? ఇప్పుడు తెలంగాణలో ఇదే హాట్ టాపిక్. ఎగ్జిట్ పోల్స్‌ను కొందరు అనుకూలంగా చూస్తుంటే.. మరికొందరు మాత్రం అవి కరెక్ట్ కాదని.. ఎగ్జాక్ట్ పల్స్ చూడాలని చెప్తున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా.. ఈసారి ఎగ్జిట్ పోల్స్ కూడా ప్రజలను కన్ఫ్యూజన్‌కు గురి చేస్తున్నాయి.
CM KCR : కేసీఆర్ లెక్కలు ఇవే ..! 70సీట్లు పక్కా అని ధీమా ..!!
ఇక పోలింగ్ శాతం చూస్తే.. అందరికీ క్లారిటీ రాకపోగా కొత్త సందేహాలు పుట్టుకొచ్చాయి. కొత్త ఓటర్లు ఏం చేశారు. మహిళా ఓటర్లు ఎటు మొగ్గారు.. అసలు పడింది పాజిటివ్ ఓటా.. నెగటివ్ ఓటా అనేవి.. సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలాయి. ఏ ఎన్నికలు వచ్చినా అన్ని పార్టీలకు తటస్థంగా ఉండే ఓటర్లే కీలకం. దీంతో బీఆర్ఎస్ వారిపైనే ఆశలు పెట్టుకుంది. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారిని గ్రామాలకు తీసుకొచ్చి ఓటు వేయించడంతో పాటు గ్రామంలో ఉన్న తటస్థులను సైతం ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో గట్టెక్కుతామని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరి భవితవ్యం ఏంటి అనేది డిసెంబర్ 3న తేలబోతోంది. ఆరోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమౌతుంది. మధ్యాహ్నానికల్లా ఓ క్లారిటీ వస్తుంది. సాయంత్రానికి పూర్తి ఫలితాలు వచ్చేస్తాయి.
గతంలో వచ్చిన సర్వేలు, పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల మధ్య పొంతన లేకుండా ఉండటంతో.. ఈసారి ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఇదిలా ఉంటే.. ఫలితాలు రాకముందే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 4న కేబినెట్ మీటింగ్ నిర్వహించాలని చెప్పి అందరినీ షాక్‌కు గురి చేశారు. ఇక ఇప్పటి వరకూ వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నాయి. మరోవైపు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ఈ ఎగ్జిట్ పోల్స్‌ను కొట్టిపారేస్తున్నారు. అసలు రిజల్ట్ డిసెంబర్ 3న వస్తుందని చెప్తున్నారు. ఇక తెలంగాణలో 25 నేంచి 30 సీట్లు గెలుస్తామని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఒకవేళ అదే జరిగితే.. బీజేపి కింగ్ మేకర్‌గా మారుతుంది. ఇక కాంగ్రెస్ అంచనా వేసుకున్నట్టు ఆ పార్టీకి 60 సీట్లు వస్తే రాజకీయం మారటం ఖాయం. ఒకవేళ అలా రాకపోతే బీఆర్‌ఎస్‌దే అధికారం. ఎందుకంటే బీఆర్‌ఎస్, ఎంఐఎం ఇప్పటికే అలయన్స్‌లో ఉన్నాయి. అవసరమైతే బీజేపీ మద్దతు తీసుకునే చాన్స్ కూడా ఉంది. కానీ.. ఎంఐఎం, బీజేపీ రెండు పార్టీలు ఒకే కూటమిలో ఉండే అవకాశాలు చాలా తక్కువ. ఎదో మ్యాజిక్ జరిగితే తప్ప అది సాధ్యం కాదు. అప్పుడు బీజేపీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది అనేది కూడా ఇప్పుడు బిలియన్ డాలర్ క్వశ్చన్. డిసెంబర్ 3న చూడాలి మరి.. తెలంగాణ ప్రజల తీర్పు ఎలా ఉండబోతోందో.