ELECTION NOMINATIONS: మొదలైన నామినేషన్ల పర్వం.. తొలిరోజు నామినేషన్ దాఖలు చేసింది వీళ్లే
తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు, ఒక అసెంబ్లీ స్థానానికి, ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 26 వరకు వాటిని స్క్రూట్నీ చేస్తారు. ఏప్రిల్ 29 వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు.

ELECTION NOMINATIONS: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు, ఒక అసెంబ్లీ స్థానానికి, ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 26 వరకు వాటిని స్క్రూట్నీ చేస్తారు. ఏప్రిల్ 29 వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. అనంతరం ఫైనల్‌గా పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు.
Kim Jong Un: కిమ్ గాడికి మనసుంది…! ఆడికో గర్ల్ ఫ్రెండ్ ఉంది !!
తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న ఫలితాలు ప్రకటిస్తారు. నామినేషన్ల తొలి రోజైన గురువారం రెండు రాష్ట్రాల్లో కీలక నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. ఏపీలోని ఒంగోలు లోక్‌సభ స్థానానికి మాగుంట శ్రీనివాసులు రెడ్డి (టీడీపీ), కర్నూలు ఎంపీ స్థానానికి బస్తిపాడు నాగరాజు (టీడీపీ), విజయవాడ వెస్ట్ అసెంబ్లీ స్థానానికి కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి (బీజేపీ), ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు (టీడీపీ), కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి (టీడీపీ), బుట్టా రేణుక (వైసీపీ), శ్రీశైలం అభ్యర్థిగా శిల్పా చక్రపాణిరెడ్డి (వైసీపీ), శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి (టీడీపీ), అన్నమయ్య జిల్లా రాజంపేట నుంచి వెంకట మిథున్ రెడ్డి (వైసీపీ) తరఫున ఆయన తల్లి నామినేషన్ నామినేషన్ దాఖలు చేశారు.
తెలంగాణలో మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ (బీజేపీ), మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి మాజీ మంత్రి ఈటల రాజేందర్ (బీజేపీ), నల్గొండ లోక్‌సభ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి (బీజేపీ), జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా సురేష్ షెట్కార్ (కాంగ్రెస్), భువనగిరి స్థానానికి లింగిడి వెంకటేశ్వర్లు (ప్రజావాణి పార్టీ), మెదక్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు (కాంగ్రెస్), నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి (కాంగ్రెస్) నామినేషన్లు దాఖలు చేశారు.