Elon Musk: ట్విట్టర్ పిట్టను చంపేసిన మస్క్‌.. అసలేంటీ ‘ఎక్స్’.. ఎందుకు మార్చినట్లు?

ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న ఎలన్‌ మస్క్‌.. సంస్థలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. ఉద్యోగుల తొలగింపు మొదలు.. బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ వంటి కీలక నిర్ణయాలు అమల్లోకి తీసుకొచ్చారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 24, 2023 | 05:24 PMLast Updated on: Jul 24, 2023 | 5:24 PM

Elon Musk Changed His Twitter Name To X What Is The Story Behind This X

ట్విట్టర్‌కు మారుపేరుగా నిలిచిన నీలం రంగు పక్షి లోగో స్థానంలో Xను చేర్చారు. ట్విట్టర్ వెబ్‌సైట్‌ను కూడా ఎక్స్ డాట్ కామ్‌తో అనుసంధానం చేశారు. ఇలా మార్చడం వెనక మస్క్ భారీ ఆలోచన కనిపిస్తోంది. రానున్న రోజుల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని మొత్తం కూడా.. X కార్పొరేషన్ ద్వారానే నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎలాన్ మస్క్‌కు ఎక్స్ అంటే అమితమైన ఇష్టం.

1990 నుంచి దీంతో మస్క్‌కు అనుబంధం ఏర్పడింది. 1999లో ఎలన్ మస్క్ ఎక్స్‌ డాట్‌ కామ్ పేరుతో స్టార్టప్ ప్రారంభించారు. ఆ తర్వాత అది పేపాల్ చేతిలోకి వెళ్లిపోయింది. ఐతే 2017లో ఎక్స్ డాట్ కామ్ డొమైన్‌ను ఎలాన్ మస్క్ మళ్లీ కొనుగోలు చేశారు. తనకు ఎంతో సెంటిమెంటుగా ఉన్న ఆ డొమైన్ తిరిగి తన దగ్గరకు రావడం ఎంతో సంతోషంగా ఉందని ఆ టైమ్‌లో మస్క్ తెగ మురిసిపోయాడు. ఐతే అప్పటి నుంచి ఎక్స్‌ డాట్‌ కామ్‌ను వినియోగంలోకి తీసుకురాలేదు. ఇప్పుడు ట్విట్టర్‌కు దాన్ని అనుసంధానం చేసి మళ్లీ వెలుగులోకి తెచ్చారు. ఇప్పటికే అనేక రంగాల్లో ప్రవేశించిన మస్క్.. దాదాపు అన్ని కంపెనీల్లో X అక్షరం ఉండేలా చూసుకుంటారు.

2002లో అంతరిక్ష ప్రయోగాల కోసం ప్రారంభించిన సంస్థ స్పేస్ఎక్స్, ఎలక్ట్రిక్ కారు మోడల్ ఎక్స్.. చివరకు తన కుమారుల్లో ఒకరికి పెట్టిన పేరులో కూడా ఎక్స్ అక్షరాన్ని చేర్చాడు. ఇక అటు తన ప్లాట్‌ఫారమ్‌ను వీ చాట్ లాగా మార్చాలని మస్క్ భావిస్తున్నట్లు అర్థం అవుతోంది. అందుకే ఎక్స్ అని పేరు మార్చినట్లు తెలుస్తోంది. చైనీస్ సూపర్ యాప్ వీ చాట్‌లో వినియోగదారులు ఒకే ప్లాట్‌ఫారమ్‌లో ఎన్నో సేవలను పొందుతారు. సోషల్ మీడియా, పేమెంట్ సర్వీస్, టికెట్ బుకింగ్ సర్వీస్, గేమింగ్ సర్వీస్.. ఇతర యుటిలిటీ ఆధారిత సేవలు ఇందులో అందుబాటులో ఉన్నాయ్. ఆ ఫార్మాట్‌లోనే ఎక్స్‌ డాట్‌ కామ్‌ను డెవలప్ చేయాలన్న మస్క్ స్ట్రాటజీగా కనిపిస్తోంది.