Elon Musk’s: చిన్న వయసులో ప్రపంచస్థాయి గుర్తింపు.. 14 ఏళ్లకే గ్రాడ్యూయేట్ పట్టాతో పాటూ ఉన్నత కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం..
సాధారణంగా పిల్లలు బడికి పంపించడానికి మనం నాలుగు నుంచి ఐదేళ్లు తీసుకుంటాం. అప్పుడప్పుడే పిల్లాడికి స్కూల్ అంటే ఏంటో అలవాటు చేస్తాం. కానీ ఇక్కడ అలా జరగలేదు. రెండేళ్లకే న్యూస్ చదివేంత పరిజ్ఞానాన్ని సొంతం చేసుకున్నాడు కైరాన్ క్వాజీ అనే పిల్లవాడు. ఇంతటితో ఆగకుండా చిదివిన న్యూస్ ను పదిమందితో షేర్ చేసుకునేలా ప్రావిణ్యం పొందాడు. దీంతో ఇతని 14 సంవత్సరాలకే శాంటా క్లారా యూనివర్శిటీ నుంచి గ్రాడ్యూయేట్ పట్టా పొందాడు. తాజాగా ఎలోన్ మస్క్ కు సంబంధించిన సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం కూడా సాధించాడు. ఇవన్నీ కేవలం 14 సంవత్సరాల వయసులో చేయడం ఆసక్తికరంగా మారింది.
ఇతని గురించి పూర్తి వివరాలు చూస్తే.. గతంలో షెల్డన్ షోలో అనే అతను కేవలం 11 సంవత్సరాల వయస్సులో కాలేజ్ కి వెళ్లి తన గ్రాడ్యూయేట్ పూర్తి చేశాడట. దీనికి పోటీగా ప్రస్తుతం కైరాన్ క్వాజీ నిలబడ్డాడు. గతంలో అతను ఒక్కడే ఇలా చరిత్ర సృష్టించిన వ్యక్తుల్లో ఉండేవారు. కానీ తాజాగా ఈ 14 ఏళ్ల కుర్రవాడు గ్రాడ్యూయేట్ పట్టా పొందడమే కాకుండా స్పార్క్స్ కంపెనీలో ఉద్యోగాన్ని సాధించడం గమనించదగ్గ అంశం. ఈ అంశం పై ఐఎఫ్ఎస్ అధికారి కస్వాన్ స్పందించారు. కేవలం 14 ఏళ్ల అబ్బాయి ఎలోన్ మస్క్ కంపెనీ అయిన స్పేస్ ఎక్స్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం సాధిచడం చాలా గొప్ప విషయం. తన వయసుకు మించి ఉన్న మానసిక పరిపక్వత, తెలివితేటలు, సాధించాలనే తపన, సామర్థ్యం ఉన్న వారిని నియమించుకున్న కంపెనీల్లో స్పేస్ ఎక్స్ కూడా ఒకటి అన్నారు.
క్వాజీ తన పూర్తి అంతరంగాన్ని, అనుకున్న లక్ష్యాలను తన లింక్ డిన్ పేజిలో రాసుకొచ్చాడు. ఇది నా లింక్ డిన్ పేజ్ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. నేను శాంటా క్లారా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి గ్రాడ్యూయేట్ చేశాను. ఇలా చెప్పుకోవడానికి చాలా సంతోషంగా ఉంది అన్నారు. అలాగే యంత్రాలతో పనిచేయడం అనేది ఒక పెద్ద విషయం కాదని. ఇందులో ఎలాంటి జిమ్మిక్కులు లేవని అతను తెలుసుకున్నట్లు చెప్పాడు. కష్టపడే తత్వం, సహకారం, నైపుణ్యం, జవాబుదారీతనం తో పాటూ సంస్కృతి కూడా నేర్చుకోవాలన్న తపనను పెంచేందుకు దోహదపడుతుంది లింక్ డిన్ వేదికగా ప్రస్తావించాడు.
ఇతని బాల్యంలోని విషయాలను ఏంజిల్స్ టైమ్స్ అనే జర్నల్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెలువరిచింది. క్వాజీ తనకు రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పూర్తి వాక్యాలలో ఎలా మాట్లాడాలి అనే అంశం మీద పట్టు సాధించాడట. ఇతను కిండర్ గార్డెన్ లో ఉన్నప్పుడు రేడియోలో వినే వార్తల గురించి తోటి పిల్లలతో విశ్లేషించే వారు అని చెప్పుకొచ్చింది ఈ జర్నల్. పిల్లలతో పాటూ ఏవైనా తప్పులు జరిగితే ఉపాధ్యాయులకు కూడా చెప్పేవాడని నివేదిక ఆధారంగా తెలుస్తుంది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇతని మేధా సంపత్తి ఎంతటిదో. ఇక ఇతని జీవితంలో అద్భుతమైన ఘట్టం తొమ్మిదవ ఏట ఆవిష్కృతం అయ్యింది. 9 ఏళ్ల సమయంలో మూడవ తరగతి చదువుతున్నప్పుడు తన పాఠశాలలో తనకు తగినంత జ్ఞానం అందడంలేదని భావించి తన తల్లిదండ్రలుకు చెప్పాడట ఈ కుర్రవాడు. దీంతో వారు కాలిఫోర్నయాలోని ఒక కమ్యూనిటీ కళాశాలలో అడ్మిషన్ పొందేందుకు తీవ్రంగా శ్రమించినట్లు ఇందులో రాసి ఉంది. ఇలా సీటు పొందిన కాలేజీలో పోసిటాస్ కాలేజ్ ఇతని నైపుణ్యాన్ని చూసి అడ్వాన్స్ నాలెడ్జ్ కలిగి ఉన్నందున మూడవ లెవెల్ గ్రాడ్యూయేట్ గ్రూప్ లో చేర్చుకుంది. ఇలా ఇతను అతి చిన్న వయసులోనే గ్రాడ్యూయేట్ పట్టా పొందాడు అని నివేదిక సారాంశం.
కైరాన్ క్వాజీ జీవితంలో ఏదీ అంత సులువుగా రాలేదు. ఇతను గ్రాడ్యూయేట్ పూర్తి చేసుకున్న వెంటనే చాలా సిలికాన్ వ్యాలీ కంపెనీల్లో ఉద్యోగానికి వెళ్లినట్లు చెప్పారు. అక్కడ చాలా కంపెనీలు ఇతని ఆహ్వానాన్ని తిరస్కరించాయట. అయిప్పటికీ రెట్టించిన ఉత్సాహంతో ముందడుగు వేసి ఇంటెల్ ల్యాబ్ లో లామా నాచ్ మన్ అనే వ్యక్తితో కొన్ని సమావేశాలకు హాజరయ్యారు. తద్వారా తన కెరీయర్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలో ప్రణాళికలు రచించుకున్నారు కిరణ్. ఇతని మేధస్సును లామా ముందుగానే అర్థం చేసుకున్నాడు. ఇతను సిలికాన్ వ్యాలీలోని అత్యంత ప్రసిద్ధ కంపెనీలలో నెంబర్ వన్ గా ఎదుగుతాడు అని కితాబివ్వడం ఈ కుర్రవాడి జీవితాన్నే మార్చేసింది అని చెప్పాలి.
ఇలా తన జీవన ప్రయాణంలో అతి తక్కువ ప్రాయంలోనే ఉన్నతమైన ఉద్యోగాన్ని, గ్రాడ్యూయేట్ పట్టాని సాధించిన వారిలో ఒకరిగా నిలిచి ప్రపంచానికి బలమైన సందేశాన్ని అందించారు.
T.V.SRIKAR