ఇంజనీరింగ్ వండర్: తుంగభద్ర గేటు ఫస్ట్ ఎలా ఫిక్స్ చేస్తారంటే…!
ఇటీవల భారీ వరదల కారణంగా కర్ణాటకలోని తుంగభద్ర డాం 19వ గేట్ కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. దాని స్థానంలో... స్టాప్ లాగ్ అమర్చే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుంది.
ఇటీవల భారీ వరదల కారణంగా కర్ణాటకలోని తుంగభద్ర డాం 19వ గేట్ కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. దాని స్థానంలో… స్టాప్ లాగ్ అమర్చే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుంది. నిన్ననే మొదలుపెట్టగా కొట్టుకుపోయిన గేట్ ఇనుప ముక్కలు అడ్డు రావడంతో సాంకేతిక కారణాలతో నేటికీ వాయిదా వేసారు. ప్రత్యేక నిపుణుల ద్వారా అడ్డుగా ఉన్న ఇనుప ముక్కల తొలగించారు అధికారులు. ప్రత్యేక క్రేన్ల ద్వారా 13 టన్నుల బరువు ఉన్న స్టాప్ లాక్ మొదటి యూనిట్ను నిపుణులు దించారు.
మొత్తం ఐదు యూనిట్లు ఉండగా… గేటు మొత్తం వెడల్పు 60 అడుగులు కాగా ఎత్తు 20 అడుగులు ఉంటుంది. ఐదు యూనిట్లలో మొదటి యూనిట్ ను నాలుగడుగుల ఎత్తు 60 అడుగుల వెడల్పు ఉన్న 13 టన్ ల యూనిట్ ను దించుతున్నారు. అన్నీ అనుకూలిస్తే ఈ రోజే సక్సెస్ అయ్యే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. దేశవ్యాప్తంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నిపుణులు ఈ అద్భుత ఆవిష్కరణ కోసం ఎదురు చూస్తున్నారు. మొదటి యూనిట్ ను సక్సెస్ఫుల్ గా అమర్చితే మిగిలిన 4 యూనిట్లు అమర్చడం పెద్ద సమస్య కాకపోవచ్చు అని అంచనా వేస్తున్నారు.
ఇదే కనుక జరిగితే.. 2 టిఎంసిల పైగా నీటిని సేవ్ చేయడమే కాకుండా.. వస్తున్న వరదను కూడా కూడా స్టోర్ చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. నిండుగా ఉన్న ప్రాజెక్టు గేటు తెగిపోవడంతో ఉధృతంగా ప్రవహించే నీటిలో స్టాప్ లాక్ అమర్చడం ఇంజనీరింగ్ నిపుణులకు సవాల్ గా మారింది. ఈ రోజు రేపట్లో దీనిపై ఒక అంచనా వచ్చే అవకాశం ఉంది.