David Malan : విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డా.. డేవిడ్ మలాన్
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలాన్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో మలాన్ 91 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో కెరీర్‌లో ఆరో సెంచరీని పూర్తి చేశాడు.

England opener David Malan smashed a devastating century in the ongoing match against Bangladesh at Dharamshala as part of the ODI World Cup 2023
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలాన్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో మలాన్ 91 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో కెరీర్‌లో ఆరో సెంచరీని పూర్తి చేశాడు. సెంచరీ తర్వాత గేర్ మార్చిన మలాన్.. మెహిది హసన్ మీరజ్ వేసిన ఇన్నింగ్స్ 33వ ఓవర్‌లో వరుసగా 4,6,6,4 పరుగులు సాధించి ఇంగ్లండ్‌ను భారీ స్కోర్ దిశగా అడుగులు వేయించాడు.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో సెంచరీతో మలాన్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది భీకర ఫామ్‌లో ఉన్న మలాన్, వన్డేల్లో వేగంగా ఇన్నింగ్స్‌ల పరంగా, 6 సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. మలాన్ కేవలం 23 ఇన్నింగ్స్‌ల్లోనే 6 సెంచరీలు చేయగా.. పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హాక్ 27 ఇన్నింగ్స్‌ల్లో 6 శతకాలు బాది మలాన్ వెనుక ఉన్నాడు. ఈ రికార్డుతో పాటు మలాన్ మరో ఘనత సాధించాడు. ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధికంగా 4 వన్డే సెంచరీలు చేసిన ఇంగ్లండ్ ఆటగాడిగా డేవిడ్ గోవర్, జానీ బెయిర్‌స్టోల సరసన నిలిచాడు. 107 బంతుల్లో 140 పరుగులు చేసిన మలాన్, మెహదీ హసన్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు.