EPFO: ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు ఖరారు.. 8.25 శాతం ఫిక్స్ చేసిన సీబీటీ
గత మూడేళ్లలో ఇదే అధికం. అంతకుముందు, 2022 మార్చిలో సమావేశమైన ఈపీఎఫ్ఓ సీబీటీ.. ఈపీఎఫ్ నిల్వలపై వడ్డీరేటు 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించింది. ఇది నాలుగు దశాబ్దాల కనిష్ట స్థాయి.
EPFO: ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్)పై వడ్డీ రేటు ఖరారైంది. 8.25 శాతం వడ్డీ రేటు ఖరారు చేసినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఈపీఎఫ్‌ఓ వర్గాలు తెలిపాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది. గత మూడేళ్లలో ఇదే అధికం. అంతకుముందు, 2022 మార్చిలో సమావేశమైన ఈపీఎఫ్ఓ సీబీటీ.. ఈపీఎఫ్ నిల్వలపై వడ్డీరేటు 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించింది. ఇది నాలుగు దశాబ్దాల కనిష్ట స్థాయి.
RAM GOPAL VARMA: నీకోసమే వ్యూహం రిలీజ్ డేట్ మార్చా.. 23 నంబర్‌తో చంద్రబాబును ఆడుకున్న ఆర్జీవీ..
చివరగా 1977-78లో ఈపీఎఫ్ నిల్వలపై వడ్డీరేటు 8 శాతంగా ఉండేది. తర్వాత 2020-21లో వడ్డీరేటు 8.5 శాతంగా ఉండేది. గతేడాది మార్చిలో ఈపీఎఫ్ఓ సీబీటీ సమావేశమైంది. ఈపీఎఫ్ నిల్వలపై వడ్డీరేటు 8.10 శాతం నుంచి 8.15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వీటితో పోలిస్తే ఈసారి 10 బేసిస్ పాయింట్ల మేర పెంచారు. తాజాగా శనివారం జరిగిన ఈపీఎఫ్ఓ సీబీటీ సమావేశానికి కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనాశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అధ్యక్షత వహించారు. ఈ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థికశాఖకు తెలియజేస్తారు. దీన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదించిన తర్వాత అమల్లోకొస్తుంది. ఆ తర్వాత వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్ఓకు చెందిన సుమారు 6 కోట్ల మంది చందాదారుల అకౌంట్లలో జమ చేయనున్నారు. ప్రస్తుతం ఈపీఎఫ్ఓలో ఆరు కోట్ల మంది వినియోగదారులున్నారు. గతంలో ఈపీఎఫ్ వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. 2013- 14, 2014- 15లో 8.75 శాతం, 2015- 16లో 8.8 శాతం ఉండేది.
అయితే, తర్వాత ఏడాది 15 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది ఈపీఎఫ్ఓ. దీంతో 2016- 17లో వడ్డీ 8.65 శాతంగా ఉండేది. ఆ తర్వాతి ఏడాది మరింత తగ్గి 2017- 18లో 8.55 శాతం ఇచ్చారు. తర్వాత 2018- 19లో స్వల్పంగా పెంచి 8.65 శాతానికి చేర్చారు. అనంతరం 2019- 20లో 10 బేసిస్ పాయింట్లు తగ్గించి 8.50 శాతానికి తగ్గించగా, 2020- 21లో ఎలాంటి మార్పు చేయలేదు. అయితే, కోవిడ్ మహమ్మారి కారణంగా వడ్డీ రేటులో భారీగా కోత విధించింది కేంద్రం. 2021- 22లో 8.10 శాతంగా వడ్డీ ఇచ్చారు. గతేడాది దానిని స్వల్పంగా పెంచుతూ 8.15 శాతానికి చేర్చారు. ఈ ఏడాది 8.25గా ఖరారు చేసింది.