Covid 19 : మళ్లీ వ్యాపిస్తున్న మహమ్మారి.. 24 గంటల్లో ఎన్ని కొత్త కేసులు వచ్చాయంటే..

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా వైరస్‌ కోరలు చాస్తోంది. చూస్తుండగానే పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా పిల్లల్లో వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్టు డాక్టర్లు చెప్తున్నారు. నీలోఫర్‌ హాస్పిటల్‌లో ఇద్దరు చిన్నారులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు డాక్టర్లు. దీంతో తెలంగాణలో ప్రస్తుతం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 19కి చేరింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 22, 2023 | 01:31 PMLast Updated on: Dec 22, 2023 | 1:31 PM

Epidemic Is Spreading Again How Many New Cases Have Come In 24 Hours

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా వైరస్‌ కోరలు చాస్తోంది. చూస్తుండగానే పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా పిల్లల్లో వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్టు డాక్టర్లు చెప్తున్నారు. నీలోఫర్‌ హాస్పిటల్‌లో ఇద్దరు చిన్నారులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు డాక్టర్లు. దీంతో తెలంగాణలో ప్రస్తుతం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 19కి చేరింది. గడిచిన 24 గంటల్లో 925 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా. కొత్తగా 6 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 19కి చేరింది. ఇక దేశంలో కూడా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 594 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఆరుగురు వ్యక్తులు చనిపోయారు. దీంతో దేశంలోని యాక్టివ్‌ కేసుల సంఖ్య 2 వేల 669కి చేరింది. ఐతే రికవరీ రేటు కూడా అదే స్థాయిలో ఉండటం కాస్త ఊరట కలిగించే అంశమంటున్నారు డాక్టర్లు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.81 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు.

ఐతే ఈ లెక్కలన్నీ కేవలం హాస్పిటల్‌కు వస్తున్న వారి సంఖ్యని బట్టే చెప్తున్నారు డాక్టర్లు. ఇప్పటికే పలు వేరియంట్‌లు ఫేస్‌ చేసిన ప్రజలు చాలా మంది ఇంట్లోనే ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నట్టు అంచనా వేస్తున్నారు. వాళ్లందరితో కలిపితే కరోనా కేసల సంఖ్య భారీ స్థాయిలోనే పెరిగి ఉంటుందని చెప్తున్నారు. దీంతో మరోసారి దేశంలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలు మొదలయ్యాయి. ప్రస్తుతానికి ప్రయాణాలకోసం ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లు తప్పనిసరి చేయకపోయినప్పటికీ.. ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండటం మంచిదంటున్నారు డాక్టర్లు. ప్రతీ ఒక్కరూ విధిగా మాస్క్‌ ధరించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. గత వైరస్‌లతో పోలిస్తే ఇప్పుడు వచ్చిన వేరియంట్‌ కూడా దాదాపు అదే స్థాయిలో అంతే వేగంగా వ్యాప్తి చెందుకుతున్నట్టు గుర్తించారు. ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.