Errabelli Dayakar Rao: మాజీ మంత్రి ఎర్రబెల్లికి షాక్.. కాంగ్రెస్‌లోకి ప్రధాన అనుచరుడు..!
సర్కార్ మారగానే మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలు కనిపించడం.. అవి కాంగ్రెస్ కైవసం కావడం చకచకా జరిగిపోయాయ్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్‌కు ఇప్పుడు మరో ఝలక్ తగిలింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు బిగ్ షాక్ ఎదురైంది.
Errabelli Dayakar Rao: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయ్. అధికారం కోల్పోయిన తర్వాత.. బీఆర్ఎస్ పరిస్థితి రోజురోజుకు బలహీనం అవుతోంది. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌తో.. కారు పార్టీ అల్లాడిపోతోంది. కేసీఆర్ ఫ్యామిలీకి క్లోజ్ అనుకున్న వాళ్లు.. గులాబీ పార్టీలో కీలకంగా కనిపించిన నేతల్లో చాలామంది.. కాంగ్రెస్ గూటికి చేరుకోగా.. క్షేత్రస్థాయిలోనూ భారీగా వలసలు కనిపిస్తున్నాయ్.
TDP-BJP-JANASENA: బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు ఖరారు.. ఆ పార్లమెంట్ స్థానం నుంచే పవన్ పోటీ..
సర్కార్ మారగానే మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలు కనిపించడం.. అవి కాంగ్రెస్ కైవసం కావడం చకచకా జరిగిపోయాయ్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్‌కు ఇప్పుడు మరో ఝలక్ తగిలింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు బిగ్ షాక్ ఎదురైంది. ఆయన ప్రధాన అనుచరుడు.. పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఉమ్మడి వరంగల్ డీసీసీబీ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు, ఆయన భార్య ఐనవోలు ఎంపీపీ మధుమతి కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. తమ అనుచరులతో కలిసి వేం నరేందర్ రెడ్డి సమక్షంలో వాళ్లు కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్‌ను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయ్.
ఎర్రబెల్లి దయాకరరావుకు మార్నేని ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఎర్రబెల్లి మార్క్ కనిపించేలా చేయడంలో ఆయన ఒకప్పుడు కీలకంగా వ్యవహరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవాలకు.. లోక్‌సభ ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకోవాలని బీఆర్ఎస్ భావిస్తుంటే.. కొనసాగుతున్న వలసలు.. కారు పార్టీని టెన్షన్ పెడుతున్నాయ్.