చనిపోయాక కూడా వేల కోట్ల సంపాదన టాప్‌లో మైఖేల్‌ జాక్సన్‌

మనిషికి చావు ఉంటుంది కానీ కళకు చావు ఉండదు. అందుకే కళాకారులు చనిపోయినా వాళ్ల కళలు మాత్రం ఏదో ఒక రూపంలో మన మధ్యే కనిపిస్తూ ఉంటాయి.. వినిపిస్తూ ఉంటాయి. కొందరు ప్రముఖ కళాకారుల టాలెంట్‌ మాత్రం కనిపించడమే కాదు.. ఏకంగా వేల కోట్లు కురిపిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 5, 2024 | 07:52 PMLast Updated on: Nov 05, 2024 | 7:52 PM

Even After Death Michael Jackson Is The Top Earner Of Thousands Of Crores

మనిషికి చావు ఉంటుంది కానీ కళకు చావు ఉండదు. అందుకే కళాకారులు చనిపోయినా వాళ్ల కళలు మాత్రం ఏదో ఒక రూపంలో మన మధ్యే కనిపిస్తూ ఉంటాయి.. వినిపిస్తూ ఉంటాయి. కొందరు ప్రముఖ కళాకారుల టాలెంట్‌ మాత్రం కనిపించడమే కాదు.. ఏకంగా వేల కోట్లు కురిపిస్తోంది. నార్మల్‌గా మ్యూజీషియన్లు, సింగర్లు, రైటర్లు వాళ్లు పాడిన పాటలు, ట్యూన్‌ చేసిన పాటలను వాళ్ల పేరుతో రిజిస్టర్‌ చేయించుకుంటారు. అంటే వాళ్లకు మాత్రమే సొంతం అని అర్థం. ఒకవేళ ఎవరైనా ఆ మ్యూజిక్‌ను గానీ పాటలను గానీ వాడుకోవాలి అనుకుంటే దానికి రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అలా వాళ్లు చేసిన ట్యూన్స్‌ పాడిన సాంగ్స్‌కు రాయల్టీగా ఇప్పటికే వేల కోట్లు సంపాదిస్తున్నారు కొందరు లేట్‌ ఇంటర్నేషన్‌ స్టార్స్‌.

ఈ లిస్ట్‌లో కింగ్‌ ఆఫ్‌ పాప్‌ సింగింగ్‌ మైఖేల్‌ జాక్సన్‌ ఫస్ట్‌ ప్లేస్‌లో ఉన్నాడు. ఆయన చనిపోయిన తరువాత కూడా.. మైఖేల్‌ పాటలు చాలా మంది వాడుకున్నారు. మ్యూజిక్‌లను కూడా వాడుకున్నారు. దానికి గాను మైఖేల్‌ వారసులకు రాయల్టీ చెల్లిస్తున్నారు. ఇలా గతేడాది 600 మిలియన్‌ డాలర్లున సంపాదించారు మైఖేల్‌ ఫ్యామిలీ. అంటే మన కరెన్సీలో దాదాపు 5 వేల కోట్ల పైమాటే. 2009లో మైఖేల్‌ జాక్సన్‌ చనిపోయాడు. కానీ ఆ తరువాత కూడా ఆయన మ్యూజిక్‌కు రాయల్టీగా ఆదాయం వస్తూనే ఉంది. ఇక ఇదే లిస్ట్‌లో మరో పాప్‌ సింగర్‌ ఫ్రెడ్డీ మెర్క్యూరీ సెకండ్‌ పొజిషన్‌లో ఉన్నాడు. 1991లో ఫ్రెడ్డీ చనిపోయినా ఆయన పాటలకు రాయల్టీగా 250 మిలియన్‌ డాలర్లు వచ్చాయి. అంటే మన కరెన్సీలో దాదాపు 2,102 కోట్లు. రైటర్, డాక్టర్ సియస్ ఈ లిస్ట్‌లో మూడో పొజిషన్‌లో ఉన్నాడు. 1991లోనే సియస్‌ ఊడా చనిపోయాడు.

అప్పటి నుంచి ఆయనకు కూడా రాయల్టీ ద్వారా ఆదాయం వస్తూనే ఉంది. ఇలా సియస్‌ ఇప్పటి వరకూ దాదాపు 630 కోట్లు ఆర్జించారు. 1977లో చనిపోయిన ఎల్విస్‌ ప్రెస్లీకి రాయల్టీ ద్వారా ఇప్పటి వరకూ 50 మిలియన్‌ డాలర్స్‌ వచ్చాయి. ఇక 2019లో చనిపోయిన మిలిషన్‌ రిక్‌ ఒకాసెక్‌కు ఇప్పటి వరకూ 45 మిలియన్‌ డాలర్స్‌ రాయల్టీ వచ్చింది. 2016లో చనిపోయిన ప్రిన్స్‌కు 35 మిలియన్‌ డాలర్స్‌ రాయల్టీగా వచ్చాయి. 1981లో చనిపోయిన సింగర్‌ బాబ్‌ మార్లేకు ఇప్పటి వరకూ 34 మిలియన్‌ డాలర్స్‌ రాయల్టీ వచ్చింది. 2000వ సంవత్సరంలో చనిపోయిన చార్లెస్‌ షుల్జ్‌ ఈ లిస్ట్‌లో లాస్ట్‌ పొజిషన్‌లో ఉన్నారు. ఆయనకు ఇప్పటి వరకూ 30 మిలియన్‌ డాలర్స్‌ వరకూ రాయల్టీ వచ్చింది. ఇలా వీళ్లి ఈ లోకాన్ని విడిచి వెళ్లినా కూడా.. ఇంకా వాళ్ల ఆర్ట్‌ వాళ్లకు వేల కోట్లు తెచ్చిపెడుతూనే ఉంది.