JAGAN PRAJA DARBHAR : జగన్ మారుతున్నాడా ? ఇక జనాన్ని కలుస్తాడా
ఏపీ అసెంబ్లీలో 11 సీట్లు మాత్రమే ఇచ్చి.... జనం దిమ్మతిరిగే షాకిచ్చిన తర్వాత గానీ మాజీ సీఎం జగన్ కి అర్థం కాలేదు తాను చేసిన తప్పేంటో. అధికారంలో ఉన్నప్పుడు... జనం కనిపిస్తే పరదాలు కట్టుకునేవాడు.
ఏపీ అసెంబ్లీలో 11 సీట్లు మాత్రమే ఇచ్చి…. జనం దిమ్మతిరిగే షాకిచ్చిన తర్వాత గానీ మాజీ సీఎం జగన్ కి అర్థం కాలేదు తాను చేసిన తప్పేంటో. అధికారంలో ఉన్నప్పుడు… జనం కనిపిస్తే పరదాలు కట్టుకునేవాడు. ఎమ్మెల్యేలు, పార్టీ లీడర్లు, సామాన్య కార్యకర్తలకు అపాయింట్ మెంటే ఇవ్వలేదు. గ్రౌండ్ లెవల్లో ఏం జరుగుతుందో… పార్టీని నమ్ముకున్న వారిని అడకుండా… ఐప్యాక్, సొంత సోషల్ మీడియా ఇచ్చిన పేపర్ లెక్కలు చూసుకుంటూ … మళ్లీ అధికారంలోకి వస్తున్నట్టు మురిసిపోయారు.
ఓడాక గానీ తెలిసింది జగన్ కి… జనం విలువ ఎంటో… అందుకేనేమో…జనాన్ని ఏనాడు కాలు పెట్టనివ్వని తాడేపల్లి కోటలో ప్రజాదర్భార్ నిర్వహించబోతున్నాడు జగన్. జనంతో పాటు పార్టీ కార్యకర్తల సమస్యలు, సలహాలు వినడానికి రెడీ అయిపోతున్నారు. నేను మారుతున్నా అని జనంలోకి సంకేతాలు పంపుతున్నాడు మాజీ సీఎం. ఈనెల 15 నుంచి తాడేపల్లి ఆఫీసులో ప్రజాదర్భార్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా బిల్డింగ్ ని మాడిఫై చేయిస్తున్నారు. క్యూలైన్ల ఏర్పాటు, కూర్చోడానికి కుర్చీలు… పైన షెడ్లు… ఇలా హంగామా చేస్తున్నారు వైసీపీ నేతలు. ఐదేళ్ళు మమ్మల్ని కలవడానికి జగన్ ఇష్టపడలేదు. ఆయన తలబిరుసుతనమే ఓడించింది. అని ఆ పార్టీ నేతలే డైరెక్టుగా తిట్టి పోస్తుండటంతో ఇప్పటికీ తలకెక్కినట్టు ఉంది. ఇప్పటికైనా ధనుంజయ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని రానీయకుండా… డైరెక్ట్ గా జనాన్ని కలవాలి అని జగన్ అనుకోవడంపై పార్టీ నేతలు, కార్యకర్తలు సంతోషంగా ఉన్నారు. హమ్మయ్యా… ఓడాక అయినా జగన్ లో మార్పు వచ్చింది… అది చాలు అని సంబరపడుతున్నారు వైసీపీ వీరాభిమానులు.