Junior NTR : సెట్ లో ఫోన్ చూస్తే పగలకోట్టేస్తా…?
అత్తరాంటికి దారేది సినిమా నుంచి కూడా మన టాలీవుడ్ ని లీకుల బెడద బాగా ఇబ్బంది పెడుతుంది. అప్పటి నుంచి కూడా టాలీవుడ్ లో సినిమా షూటింగ్ లు చేసే సమయంలో దర్శక నిర్మాతలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Even from the movie Attarantiki Daredi, our Tollywood is troubled by the problem of leaks.
అత్తరాంటికి దారేది సినిమా నుంచి కూడా మన టాలీవుడ్ ని లీకుల బెడద బాగా ఇబ్బంది పెడుతుంది. అప్పటి నుంచి కూడా టాలీవుడ్ లో సినిమా షూటింగ్ లు చేసే సమయంలో దర్శక నిర్మాతలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దర్శకుడిలో ఉన్న సృజనాత్మకత, నిర్మాత కష్టం ఇవన్నీ కూడా మట్టిలో కలిసిపోతాయి. చిన్న హీరో లేదు పెద్ద హీరో లేదు అందరి సినిమాలకు ఇదే సమస్య ఎదురు అవుతూ వస్తుంది. రాజమౌళి అయితే సినిమా సెట్స్ లో కఠిన రూల్స్ తీసుకొచ్చారని, ఫోన్ ను అసలు అనుమతించేది లేదని ఘాటుగానే చెప్పారట.
ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజమౌళి బాటలోనే వెళ్తానని స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. దేవర సినిమా కోసం చాలా కష్టపడుతున్న యంగ్ టైగర్… తన లుక్ కోసం చాలా వర్కౌట్ చేసాడు. ఇక సముద్రంలో కూడా షూటింగ్ చేసే పరిస్థితి ఉండటంతో తన ఆరోగ్యం విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే లీకుల సమస్య ఇప్పుడు ఎన్టీఆర్ ను కంగారు పెట్టేస్తుంది. ఇటీవల సినిమాలో నటించిన ఒక నటుడు దాదాపుగా స్టోరీ మొత్తం చెప్పినంత పని చేసాడు. ఇక ఇప్పుడు ఒక లుక్ ని లీక్ చేసారు.
ఇందులో ఎన్టీఆర్ కొత్తగా ఉన్నాడు… అటు తిరిగి ఇటు తిరిగి ఆ లుక్ ఎన్టీఆర్ వద్దకు కూడా వచ్చింది. దీనితో సినిమా సెట్ లో ఒక మీటింగ్ పెట్టి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట ఎన్టీఆర్. ఎవరైనా ఫోన్ తెస్తే ఒక బాక్స్ లో పెట్టి స్లిప్ తీసుకోవాలని, షూటింగ్ నుంచి వెళ్ళే సమయంలో ఆ ఫోన్ తీసుకుని వెళ్లాలని… ఎవరి ఫోన్ అయినా తన కంట పడితే పగలకోట్టేస్తా అని వార్నింగ్ ఇచ్చాడట. దర్శకుడు కొరటాల శివ కూడా ఎన్టీఆర్ తరహాలోనే వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడు సెట్స్ లో ఉన్న వారందరూ జాగ్రత్త పడుతున్నారట. ఇక కెమెరా మెన్ లు కూడా జాగ్రత్త పడాలని, ల్యాప్ టాప్ లలో కూడా ఫోటో లు తీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాడట ఎన్టీఆర్. సినిమా షూటింగ్ అయ్యే వరకు సెట్ లో ఏ ఒక్కరు కూడా తనతో దిగిన ఫోటో లు కూడా రిలీజ్ చేయడానికి వీలు లేదని కండీషన్ పెట్టాడట తారక్.