నన్ను సస్పెండ్ చేసినా ఓకే, ఎమ్మెల్యేతో సిఐ గొడవ…!
ఆంధ్రప్రదేశ్ లో కొందరు పోలీసులు టీడీపీ ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణలు ఆ పార్టీ నేతలు పదే పదే చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ లో కొందరు పోలీసులు టీడీపీ ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణలు ఆ పార్టీ నేతలు పదే పదే చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఇసుక అక్రమాలను అడ్డుకోవాలని తాడిపత్రి ఎమ్మెల్యే జేసి అష్మిత్ రెడ్డి… స్థానిక సిఐ కి ఫోన్ చేసి చెప్తే సిఐ కేసు పెట్టను అని చెప్పడం వివాదాస్పదం అయింది. ఈ నేపధ్యంలో సిఐని ఎస్పీ పిలిపించి మాట్లాడారు. నిన్న క్షమాపణ చెప్పినా వివాదం ముగిసింది అని అందరూ భావిస్తున్నారు.
అయితే ఎస్పీని కలిసిన అనంతరం సిఐ కీలక వ్యాఖ్యలు చేసారు. తాడిపత్రి ఘటనలో నా వైపు నుంచి ఎలాంటి తప్పులేదు అని స్పష్టం చేసారు. లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలుగుతుందని… ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆ సమయంలో ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డిని క్షమాపణ కోరాను అన్నారు. ఎమ్మెల్యేతో నేను దురుసుగా ప్రవర్తించలేదు అని ఎస్సీ, ఎస్టీ కేసు నా పరిధిలోని అంశం కాదని … అది డీఎస్పీ విచారణ చేస్తారని మాత్రమే అస్మిత్ రెడ్డితో చెప్పాను అన్నారు. నేను తాడిపత్రిలో 14 నెలల నుంచి విధులు నిర్వహిస్తున్నా…ఎలాంటి ఇబ్బందులు రాలేదు అని పేర్కొన్నారు. నా మీద ఎలాంటి చర్యలు తీసుకున్నా… నాకు ఓకే అంటూ సిఐ సంచలన వ్యాఖ్యలు చేసారు.