KCR video from Hospital:మీరు యశోదాకు రావొద్దు – పేషెంట్లకు ఇబ్బంది : కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత KCR బీఆర్ఎస్ కార్యకర్తలకు, అభిమానులకు ఓ వీడియో మెసేజ్ పంపారు. తనను చూడటానికి ఎవరూ యశోద హాస్పిటల్ కు రావొద్దని విజ్ఞప్తి చేశారు. హాస్పిటల్ బెడ్ నుంచి రికార్డు చేసిన ఓ వీడియో సందేశాన్ని పంపారు.

Ex-CM KCR video message from Hospital: బీఆర్ఎస్ అధినేత KCR బీఆర్ఎస్ కార్యకర్తలకు, అభిమానులకు ఓ వీడియో మెసేజ్ పంపారు. ప్రస్తుతం యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు మాజీ సీఎం కేసీఆర్. తన ఆరోగ్య పరిస్థితి తెలుసుకోడానికి, పరామర్శించడానికి యశోదకు భారీగా తరలివస్తున్న జనానికి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
‘తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాననీ… త్వరలో సాధారణ స్థితికి చేరుకుని మీ మధ్యకే వస్తాననీ అప్పటి దాకా సంయమనం పాటించాలని మాజీ సీఎం కేసీఆర్ కోరారు. మీరెవరూ యశోద హాస్పిటల్ కు రావొద్దు. నాతో పాటు వందల మంది పేషెంట్లు హాస్పిటల్ లో ఉన్నారు. మన వల్ల వాళ్ళకి ఇబ్బంది కలగవద్దని విజ్ఞప్తి చేశారు కేసీఆర్. త్వరలోనే కోలుకొని మీ ముందుకు వస్తానని వీడిలో మెస్సేజ్ లో తెలిపారు.