Home Minister, Mallar Reddy : హోంమంత్రి ఇస్తే కాంగ్రెస్‌లోకి.. మల్లారెడ్డి మరో సంచలనం..

మాజీ మంత్రి (Ex-minister Mallareddy) మల్లారెడ్డి (Mallar Reddy) క్రేజ్ స్పెషల్‌గా చెప్పాల్సిన పనేముంది. కష్టపడ్డా అనే ఒక్క డైలాగ్‌తో ఈ ఎన్నికల్లో ఈజీగా గెలిచేశాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 30, 2024 | 06:33 PMLast Updated on: Jul 30, 2024 | 6:33 PM

Ex Minister Mallareddys Craze Needs To Be Specially Mentioned He Won This Election Easily With A Single Dialogue That He Had A Hard Time

మాజీ మంత్రి (Ex-minister Mallareddy) మల్లారెడ్డి (Mallar Reddy) క్రేజ్ స్పెషల్‌గా చెప్పాల్సిన పనేముంది. కష్టపడ్డా అనే ఒక్క డైలాగ్‌తో ఈ ఎన్నికల్లో ఈజీగా గెలిచేశాడు. ఆయన ఏం చేసినా వివాదమే. రేవంత్‌కు (CM Revanth Reddy), మల్లారెడ్డి (Mallar Reddy) కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయ్. కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) అధికారంలోకి వచ్చాక.. మల్లారెడ్డికి తగిలిన షాక్‌లు అన్నీ ఇన్నీ కావు. కాలేజీల మీద కేసులు, ఆయన మీద కేసులు.. దెబ్బకు మల్లారెడ్డి సైలెంట్ అయ్యారు. ఐతే పార్టీలో చేరికల వ్యవహారం.. తెలంగాణ రాజకీయా (Telangana politics) ల్లో ఆసక్తి రేపుతున్న వేళ.. అసెంబ్లీ చిట్‌చాట్‌లో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత హాట్‌టాపిక్ అవుతున్నాయ్.

అసెంబ్లీ లాబీల్లో (Assembly Lobby) మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు మల్లారెడ్డి. బీఆర్‌ఎస్‌ (BRS) ముచ్చటగా మూడోసారి గెలిస్తే.. తాను వేరే లెవల్‌లో ఉండేవాడినని చెప్పుకొచ్చాడు. బీఆర్ఎస్ గెలిస్తే తాను హోం మినిస్టర్ అయ్యేవాడినని.. దీంతో పాటు ఏడాదికి నాలుగు సినిమాలు తీసే వాడని అని చెప్పుకొచ్చారు. కొత్త శాటిలైట్ ఛానల్‌ (Satellite channel) కూడా పెట్టేవాడినని అన్నారు మల్లారెడ్డి. ఇక్కడితో ఆగారా అంటే.. హోంమంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్‌లో చేరేందుకు తాను రెడీ అని.. ఐతే రేవంత్‌ తనను ఆ పార్టీలోకి రానివ్వరని.. హోంమంత్రి (Home Minister) ప్రస్తుతం ఆయన చేతుల్లోనే ఉంది అంటూ.. మల్లారెడ్డి జోకులు వేశారు. దేశంలో విద్యాసంస్థల నిర్వహణలో తానే నంబర్ వన్ అని చెప్పుకొచ్చిన మల్లారెడ్డి.. అసెంబ్లీలో అధికార పక్షం తనను రెచ్చగొట్టడం లేదని.. అందుకే సైలెంట్‌గా ఉంటున్నానని చెప్పారు.

తనపై ఎవరైనా కామంట్ చేస్తే ధీటైనా సమాధానం చెప్పడానికి రెడీ అంటూ సవాల్‌ విసిరారు. తమ పార్టీ నేతలను పొగుడుతూ… ఇతర పార్టీల నాయకులపై సెటైర్లు విసురుతూ… నవ్వుల పువ్వులు పూయించారు మల్లారెడ్డి కాళేశ్వరం వెళ్లినప్పుడు ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు కదా.. దేవుణ్ని ఏం కోరుకున్నారేంటని అడిగిన ప్రశ్నకు.. వచ్చేసారి బీఆర్‌ఎస్‌ గెలవాలి, కేటీఆర్‌ సీఎంగావాలె.. నేను హోం మినిష్టర్‌ కావాలె అని కోరుకున్నానని మల్లారెడ్డి ఆన్సర్‌తో జర్నలిస్టులు తెగ నవ్వేశారు.