Chandu WhatsApp chat : బయటపడ్డ చందు వాట్సాప్ చాట్.. లాస్ట్ మెసేజ్ ఎవరికి అంటే..
సీరియల్ యాక్టర్ చందు ఆత్మహత్య కేసులో.. వాట్సాప్ చాట్ కీలకంగా కాబోతోంది. గత కొన్నేళ్లుగా ఆయన సహజీవనం చేస్తున్న పవిత్ర జయరాం.. ఈ మధ్య రోడ్డు యాక్సిడెంట్‌లో చనిపోవడంతో చందు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు.

Exposed Chandu WhatsApp chat.. To whom is the last message meant..
సీరియల్ యాక్టర్ చందు ఆత్మహత్య కేసులో.. వాట్సాప్ చాట్ కీలకంగా కాబోతోంది. గత కొన్నేళ్లుగా ఆయన సహజీవనం చేస్తున్న పవిత్ర జయరాం.. ఈ మధ్య రోడ్డు యాక్సిడెంట్‌లో చనిపోవడంతో చందు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. పవిత్ర లేని జీవితం ఊహించుకోలేనట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ కేసులో సూసైడ్‌కు ముందు ఆయన ఎవరితో చాట్ చేశారో తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. చందు స్నేహితులు చాటింగ్ వివరాల్ని.. పోలీసులకు అందజేశారు. పవిత్ర మరణం తర్వాత.. పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిన చందు.. ముభావంగా ఉండేవాడు. దీంతో తోటి నటులు, స్నేహితులు ఆయనను ఓదార్చే ప్రయత్నం చేసేవారు. దీనికి సంబంధించిన వాట్సాప్ చాటింగ్ ఒకటి.. ఇప్పుడు బయటకు వచ్చింది.
పవిత్ర లేని జీవితం తాను ఊహించుకోలేకపోతున్నానని.. ఆమె దగ్గరకే వెళ్లిపోతా అంటూ.. చందు పదేపదే అనేవాడని ఆ చాటింగ్ ద్వారా అర్థం అవుతోంది. తాను వెళ్లిపోతానని.. ఈ జన్మకు ఇది చాలు అంటూ.. సీరియల్ ఇండస్ట్రీలో ఉన్న ఓ ప్రముఖ నటుడికి మెసేజ్ చేశాడు చందు. తాను వెళ్లిపోతేనే కరెక్ట్ అని.. పవిత్ర లేని జీవితం తనకు వద్దని.. ఇలానే ఉంటే పిచ్చోడినైనా అవుతానని లేదంటే తాగుబోతును అయినా అవుతాను అంటూ.. చందు పెట్టిన మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐతే స్నేహితులు చందును ఓదార్చే ప్రయత్నం చేశారు. తామంతా ఉన్నామని.. ఎలాంటి ఇబ్బంది పడొద్దని.. తాము చూసుకుంటామని ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఐనా సరే.. చందు ఈ దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. సూసైడ్ చేసుకొని చనిపోయాడు. చందుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఐతే చందు మరణం తర్వాత.. మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయ్. చందు భార్య శిల్ప చేసిన కామెంట్లు.. ఇప్పుడు వైరల్ అవుతున్నాయ్.