జబర్దస్త్ ఫైమా గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పటాస్ అనే ఒక కామెడీ షోలో ఆడియన్ గా వచ్చి.. తన టాలెంట్ తో అక్కడి వారిని మేస్మరైజ్ చేసి.. లేడీ కమెడియన్ గా తన కెరీర్ ని ప్రారంభించింది. ఆ తర్వాత ఇప్పటి వరకు మళ్లీ కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. బిగ్ బాస్ కి వెళ్లిన తర్వాత ఫైమా రేంజ్, క్రేజ్ నెక్ట్స్ లెవల్ కి వెళ్లిపోయింది. అటు సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. తాజాగా ఫైమా సోషల్ మీడియా వేదికగా తన బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసింది. జబర్దస్త్ ఫైమా పుట్టినరోజు సందర్భంగా జబర్దస్త్ నటులు, అభిమానులు, ఫాలోవర్స్ అంతా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఫైమాకు ప్రవీణ్ నాయక్ మాత్రం స్పెషల్ సర్ ప్రజ్ ఇచ్చాడు. ఫైమా చేతికి రింగ్ తొడుగుతూ రెడ్ కలర్ హార్ట్ సింబల్ పిల్లో ఇచ్చాడు. ఆ పిక్స్ చూసి అంతా వీళ్లకి ఎంగేజ్మెంట్ అయ్యిందా అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే ప్రవీణ్ పెట్టిన క్యాప్షన్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. “హ్యాపీ బర్త్ డే మై లవ్.. అప్పుడే ఐదేళ్లు గడిచిపోయాయి. ఎలా గడిచిపోయాయో కూడా తెలీదు. నా జీవితం మొత్తం నీతో గడిపేయాలి. ఐ లవ్ ఫరెవర్ కన్నా” అంటూ క్యాప్షన్ పెట్టాడు. తాను పెట్టిన పోస్టుకు ఫైమాని కూడా ట్యాగ్ చేశాడు. ఆమె కూడా తన వాల్ మీద ఈ పిక్స్ ని షేర్ చేసింది. వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఉందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న మాట నిజమే. ఫైమా కూడా ఇప్పుడు దానిని అధికారికంగా ప్రకటించినట్లు అయ్యింది. ప్రస్తుతం నెట్టింట ఈ పిక్స్ వైరల్ గా మారాయి. అంతా ఫైమాకి శుభాకాంక్షలు చెబుతూనే మరోవైపు పటాస్ ప్రవీణ్ గురించి ప్రశ్నిస్తున్నారు. ప్రవీణ్ తో ప్రేమ నిజం కాదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే వారి మధ్య ప్రేమ లేదని ఇప్పటికే ఫైమా క్లారిటీ ఇచ్చేసింది. ప్రవీణ్ కూడా ఫైమా ఎప్పుడూ తనని ప్రేమించలేదని గతంలోనే క్లారిటీ ఇచ్చాడు. వారి మధ్య జరిగిన గొడవ గురించి ఫైమా కూడా చెప్పేసింది. ప్రవీణ్ కు తల్లిదండ్రులు లేకపోవడం వల్ల అతను చేసే కామెంట్స్ తనకు నెగిటివ్ అవుతున్నాయని వాపోయింది. ఇది జరుగుతుండగానే మరో బిగ్ ట్విస్ట్ ఇచ్చింది ఫైమా. తన కొత్త బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసి మూడు రోజులు కూడా కాలేదు.. మళ్లీ పాత లవర్ పటాస్ ప్రవీణ్ తో కనిపించిందీ లేడీ కమెడియన్. తన బర్త్ డే పార్టీలోనే ప్రవీణ్ తో కలిసి ఓ రీల్ చేసి దానిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. అది కూడా టిల్లు స్క్వేర్ స్పూఫ్ చేయడంతో అభిమానులు, నెటిజన్లు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు అసలు వీరిద్దరి మధ్య అసలు ఏం జరుగుతుందో అర్థం కాక నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ ఇద్దరిలో ఎవరు ఫ్రెండ్ ఎవరు లవర్ రాధికా అంటూ ఫైమాను ట్రోల్ చేస్తున్నారు.