వాట్సాప్ లో కలెక్టర్ కే షాక్ ఇచ్చాడు…!
కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ పేరిట గుర్తుతెలియని దుండగులు ఫేక్ వాట్సాప్ అకౌంట్ ను ఓపెన్ చేసారు గుర్తు తెలియని దుండగులు.

ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగస్తుల పేరుతో సోషల్ మీడియాలో డబ్బులు వసూలు చేస్తూ కొందరు నేరాలకు పాల్పాడుతున్నారు. తాజాగా ఏకంగా జిల్లా కలెక్టర్ పేరు మీదనే నకిలీ వాట్సాప్ ఖాతా ఓపెన్ చేయడం సంచలనం అయింది. కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ పేరిట గుర్తుతెలియని దుండగులు ఫేక్ వాట్సాప్ అకౌంట్ ను ఓపెన్ చేసారు గుర్తు తెలియని దుండగులు.
కలెక్టర్ ఫోటోతో డిస్ ప్లే పిక్చర్ ను వినియోగిస్తూ డబ్బులు పంపాలంటూ కలెక్టరేట్ లోని ఏటివోఓ కు మెసేజ్ చేసారు. దీంతో అప్రమత్తమై కలెక్టర్ దృష్టికి కలెక్టరేట్ సిబ్బంది తీసుకువెళ్ళి ఆయనకు పరిస్థితి వివరించారు. దీంతో స్థానిక దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో కలెక్టర్ పేరిట పోలీసులకు ఫిర్యాదు చేసారు ఏవో సయ్యద్ అహ్మద్ మస్రాద్. కేసు నమోదు చేసుకుని దేవునిపల్లి పోలీసులు విచారణ చేస్తున్నారు.