Family politics : వైసీపీని టెన్షన్‌ పెడుతున్న ఫ్యామిలీ పాలిటిక్స్‌

ఏపీ రాజకీయా (AP Politics) ల్లో పరిస్థితి సినిమాలకు ఏమాత్రం తీసిపోవడంలేదు. ఎవరు ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి ఎలాంటి షాకులు ఇస్తారో ఎవరికీ అర్థం కావడంలేదు. రీసెంట్‌గా ముద్రగడ (Mudragada Padmanabham) కూతురు తండ్రిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ మీడియా మందుకు వచ్చారు. పవన్‌కు మద్ధతుగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 5, 2024 | 03:43 PMLast Updated on: May 05, 2024 | 3:43 PM

Family Politics Is Putting Tension On Ycp

ఏపీ రాజకీయా (AP Politics) ల్లో పరిస్థితి సినిమాలకు ఏమాత్రం తీసిపోవడంలేదు. ఎవరు ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి ఎలాంటి షాకులు ఇస్తారో ఎవరికీ అర్థం కావడంలేదు. రీసెంట్‌గా ముద్రగడ (Mudragada Padmanabham) కూతురు తండ్రిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ మీడియా మందుకు వచ్చారు. పవన్‌కు మద్ధతుగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈ ఎపిసోడ్‌ మర్చిపోకముందే ఇప్పుడు అంబటి రాంబాబు అల్లుడు కూడా మీడియా ముందుకు వచ్చారు. అంబటి లాంటి వ్యక్తి తనకు మామ అని చెప్పుకునేందుకు సిగ్గు పడుతున్నానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో అంబటి లాంటి నీచుడుకి ఓట్లు వెయ్యకండి అని నేరుగానే చెప్పేస్తున్నారు ఆయన అల్లుడు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ముద్రగడ విషయంలో కూడా ఇదే జరిగింది. కేవలం పవన్‌ను తిట్టించడానికి మాత్రమే తన తండ్రిని జగన్‌ వాడుకుంటున్నాడు అని ఆయన కూతురు చెప్పారు. ఎన్నికలకు సరిగ్గా రెండు వారాలు కూడా లేని ఇలాంటి సమయంలో ఈ వరుస ప్రెస్‌మీట్లు వైసీపీని టెన్షన్‌ పెడుతున్నాయి. ఆరోపణలు చేసేది పరాయివాళ్లా అంటే అదీ కాదు. స్వయంగా కుటుంబ సభ్యులే ఇలా కీలక నేతలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మరోపక్క ఈ వ్యాఖ్యలు కూటిమికి ఆయుధంగా మారుతున్నాయి.

సొంత కుటుంబ సభ్యులనే సరిగ్గా చూసుకులేని ఇలాంటి వాళ్ల మని అవసరమా అంటూ టీడీపీ (TDP), జనసేన (Jana Sena) నేతలు ప్రచారం చేస్తున్నాయి. ఏపీలో ఎన్నికలకు సరిగ్గా పది రోజులు కూడా సమయం లేదు. చాలా ప్రాంతాల్లో వైసీపీ (YCP) కి ఇంకా వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దీనికి తోడు ఇప్పుడు రోజుకొకరు ఇలా ప్రెస్‌మీట్లు పెట్టడం మరో తలనొప్పిగా మారింది. చూడాలి మరి కుటుంబ సభ్యుల నుంచే వస్తున్న ఈ వ్యతిరేక స్వరాలు వైసీపీకి ఎలాంటి ఝలక్‌ ఇస్తాయో.