Game Changer : గేమ్ ఛేంజర్ ఏం చేస్తున్నాడు. వస్తాడా రాడా..?
రామ్‌చరణ్, శంకర్ మూవీ గేమ్ ఛేంజర్ నుంచి అప్డేట్ రావడం లేదని.. ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఓ అభిమాని అయితే.. సోషల్ మీడియాలో ఏకంగా సూసైడ్ నోట్ రాసేశాడు. ఇంతకీ గేమ్‌ఛేంజర్ ఏం చేస్తున్నాడు? శంకర్‌తో సినిమా అంటే మాటలు కాదు.

Fans are feeling that there is no update from Ramcharan and Shankars movie game changer A fan wrote a suicide note on social media So what is the game changer doing?
రామ్‌చరణ్, శంకర్ మూవీ గేమ్ ఛేంజర్ నుంచి అప్డేట్ రావడం లేదని.. ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఓ అభిమాని అయితే.. సోషల్ మీడియాలో ఏకంగా సూసైడ్ నోట్ రాసేశాడు. ఇంతకీ గేమ్‌ఛేంజర్ ఏం చేస్తున్నాడు? శంకర్‌తో సినిమా అంటే మాటలు కాదు. ఇది అందరికీ.. ఇన్ క్లూడింగ్ హీరో డైరెక్టర్‌కు కూడా తెలుసు. అందుకే ఆమధ్య ఓ ఈవెంట్‌లో గేమ్ ఛేంజర్ గురించి అడిగితే.. శంకర్‌నే అడగాలంటే చేతులెత్తేశాడు. అప్‌డేట్స్ గురించి ఏమీ చెప్పడం లేదని.. ఓ అభిమాని సూసైడ్ నోట్ రాయడం సంచలనం సృష్టించింది. అయితే దసరాకు లేదంటే దీపావళికి సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ లేదంటే.. గ్లిమ్స్‌ను రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. గేమ్ ఛేంజర్ కోసం భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తే.. హీరోకు గాయం కారణంగా షూటింగ్ వాయిదాపడింది. రెస్ట్ తీసుకోవాలని చెప్పడంతో.. షూటింగ్ అక్టోబర్ 5కు పోస్ట్ పోన్ చేశాడు. గేమ్ ఛేంజర్ తర్వాత చెర్రీ నటించే బుచ్చిబాబు సినిమా పనులు మాత్రం సాగుతున్నాయి. వీటి గురించి అప్డేట్స్ ఇవ్వకపోయినా.. రెహమాన్ మ్యూజిక్ కంపోజేషన్‌లో ఒక సాంగ్ రికార్డింగ్ పూర్తయిందని తెలిసింది. రామ్‌చరణ్, బుచ్చిబాబు సినిమాలో హీరోయిన్‌గా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. జాన్వి కపూర్ పేరు ముందుగా వచ్చినా.. ప్రస్తుతం రవీనా టాండన్ కూతురు రషా తండాని పేరు బైటకొచ్చింది. ఆల్రెడీ ఫోటో షూట్ కూడా నిర్వహించినా.. ఓకే అయిందో లేదో తెలియడం లేదు.