Farmers Protest: ఢిల్లీలో ఉద్రిక్తత… రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం !
యూపీ, పంజాబ్, హర్యానా నుంచి 2 వేలకు పైగా ట్రాక్టర్లతో రాజధాని నగరానికి వస్తున్నారు. వాళ్ళని ఢిల్లీలోకి అడుగుపెట్టకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారీకేడ్స్, ఇనుప కంచెలతో పాటు కొన్ని చోట్ల రోడ్లపై గోడలు కూడా నిర్మించారు.
Farmers Protest: రైతుల ఆందోళనతో ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడంతో పాటు.. అనేక సమస్యలపై 20 వేల మంది దాకా రైతులు ఢిల్లీ ఛలో కార్యక్రమానికి పిలుపు ఇచ్చారు. యూపీ, పంజాబ్, హర్యానా నుంచి 2 వేలకు పైగా ట్రాక్టర్లతో రాజధాని నగరానికి వస్తున్నారు. వాళ్ళని ఢిల్లీలోకి అడుగుపెట్టకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారీకేడ్స్, ఇనుప కంచెలతో పాటు కొన్ని చోట్ల రోడ్లపై గోడలు కూడా నిర్మించారు.
YV Subba Reddy: ఏపీ రాజధానిగా హైదరాబాద్.. ఏపీలో రాజధాని నిర్మించే పరిస్థితి లేదు: వైవీ సుబ్బారెడ్డి
అయితే శంభు బోర్డర్ ఏరియాలో భారీగా వస్తున్న రైతులను పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ తలెత్తింది. కొందరు రాళ్ళు విసరడంతో.. హర్యానా పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. స్మోక్ బాంబ్స్ వదులుతున్నారు. రైతులు మాత్రం బ్యారీకేడ్స్ బద్దలు కొడుతూ ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ బోర్డర్ లో కొంతమంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరిహద్దుల్లో 144 సెక్షన్ విధించారు. పోలీసులతో పాటు CAPF, క్రైమ్ బ్రాంచ్ బెటాలియన్ సిబ్బంది గస్తీ కాస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి రైతులు దఫాలుగా ఢిల్లీ బోర్డర్ కి చేరుకుంటున్నారు. టిక్రీ బోర్డర్ దగ్గర 11 కంపెనీల బలగాలను సిద్ధంగా ఉంచారు. శాంతిభధ్రతల సమస్య తలెత్తకుండా చూస్తామంటున్నారు పోలీస్ అధికారులు.
మరోవైపు రైతులకు వ్యతిరేకంగా ఢిల్లీ బోర్డర్ ఏరియాలో వ్యాపారులు, స్థానికులు ధర్నాలు చేస్తున్నారు. గత రెండేళ్ళుగా ఈ ధర్నాలతో వ్యాపారాలు దెబ్బతింటున్నాయని బహదూర్‌గఢ్‌లో వ్యాపారులు ధర్నా చేశారు. ఈ ఏరియాలో కమర్షియల్ వెహికిల్స్ కి అనుమతించడం లేదనీ… ఇంటర్నెట్ కూడా బంద్ చేయడంతో తీవ్రంగా నష్టపోతున్నామని అంటున్నారు. రైతులు రాకుండా రోడ్లపై పోలీసులు బారీకేడ్స్ ఏర్పాటు చేయడంతో గుర్గావ్-ఢిల్లీ బోర్డర్ లోని సిర్హాల్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వేల సంఖ్యలో కార్లు కిలోమీటర్ల దూరం దాకా నిలిచిపోయాయి.