UP Accident : యూపీలో ఘోర ప్రమాదం.. 18 మంది దుర్మరణం..
ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యూపీ రాజధాని లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై పాల ట్యాంకర్‌ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టింది.
ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యూపీ రాజధాని లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై పాల ట్యాంకర్‌ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మంది దుర్మరణం చెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మరోవైపు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. కాగా, ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇవాళ ఉదయం 5.15 గంటలకు ‘ఉన్నావ్ జిల్లాలోని లఖ్‌నవూ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 18 మంది మరణించగా, 30 మందికి పైగా గాయాలు.. ప్రమాద తీవ్రతకు రోడ్డుపై చెల్లాచెదురుగా మృతదేహాలు పడి ఉన్నాయి. బిహార్ నుంచి దిల్లీకు వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు ఉన్నావ్లోని బెహతా ముజావర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గధా గ్రామం ముందు ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి కారణంగా అతివేగంగా వెళ్లడమేనని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు’ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.