తండ్రయిన సర్ఫరాజ్ ఫుల్ జోష్ లో యువ క్రికెటర్

టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రి అయ్యాడు. అతని సతీమణి రోమానా జహూర్ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంతోషకర విషయాన్ని సర్ఫరాజ్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. బిడ్డను ఎత్తుకున్నఫొటోలను కూడా షేర్ చేశాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 22, 2024 | 06:13 PMLast Updated on: Oct 22, 2024 | 6:13 PM

Father Sarfaraz Is A Young Cricketer In Full Swing

టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రి అయ్యాడు. అతని సతీమణి రోమానా జహూర్ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంతోషకర విషయాన్ని సర్ఫరాజ్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. బిడ్డను ఎత్తుకున్నఫొటోలను కూడా షేర్ చేశాడు. తండ్రైన సర్ఫరాజ్ ఖాన్‌కు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇటీవల న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌లో శతకం సాధించిన సర్ఫరాజ్ ఖాన్‌.. తాజాగా తండ్రి అవ్వడంతో వారింట్లో సంతోషం రెట్టింపు అయ్యింది. గతేడాది ఆగస్టులో రోమానా జహూర్‌తో సర్ఫరాజ్ ఖాన్‌కు పెళ్లైంది. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌తో సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.