FATHER-DAUGHTER: నా కూతురు ప్రేమ పెళ్లి చేసుకుంది.. అది ఈరోజు చచ్చినట్టే.. కన్నీళ్లు పెట్టిస్తోన్న ఓ నాన్న మాటలు..

ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురిపై.. ఏ తండ్రీ చేయని పని చేయని చేశాడు ఆయన. బతికుండగానే కూతురికి పిండం పెట్టి దినం చేశాడా తండ్రి. అయ్యాలారా.. అమ్మలారా.. నాలా ఎవరూ మోసపోవద్దు అంటూ ఆ తండ్రి పెడుతున్న కన్నీళ్లు.. ఇప్పుడు ప్రతీ ఒక్కరిని కదిలిస్తున్నాయ్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 8, 2024 | 04:10 PMLast Updated on: Apr 08, 2024 | 6:31 PM

Father Took Serious Step About Her Daughter Who Went And Married Loved Ones

ATHER-DAUGHTER: ఓ కూతురు చేసిన మోసానికి తండ్రి పడుతున్న ఆవేదన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆ తండ్రి కూతురును అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. ఆమె భవిష్యత్‌ కోసం తన కళ్లతో కలలు కన్నాడు. తన కూతురిని పెద్ద ఉద్యోగంలో చూడాలని కోరుకున్నాడు. కట్‌ చేస్తే.. ప్రేమ పెళ్లి చేసుకొని తండ్రిని కాదనుకుంది ఆ కూతురు. దీంతో ఆ కన్న హృదయం తట్టుకోలేకపోయింది. ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది.

Pothina Mahesh: జనసేనకు పోతిన మహేశ్ రాజీనామా..

ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురిపై.. ఏ తండ్రీ చేయని పని చేయని చేశాడు ఆయన. బతికుండగానే కూతురికి పిండం పెట్టి దినం చేశాడా తండ్రి. అయ్యాలారా.. అమ్మలారా.. నాలా ఎవరూ మోసపోవద్దు అంటూ ఆ తండ్రి పెడుతున్న కన్నీళ్లు.. ఇప్పుడు ప్రతీ ఒక్కరిని కదిలిస్తున్నాయ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సిరిసిల్లకు చెందిన చిలువేరు మురళి కుమార్తె అనూష్ణ.. బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. ఆమె ఓ యువకుడిని ప్రేమించింది. ఐతే ఇంట్లో విషయం తెలియడంతో.. తండ్రి వారించాడు. ఈ వయసులో ఇలాంటి పనులు సరికాదని వార్నింగ్ ఇచ్చాడు. బుద్దిగా చదువుకోవాలని సూచించాడు. అనూష్ణ మాత్రం తండ్రి మాటలను పట్టించుకోలేదు. తమను విడదీస్తారేమో అనే భయంతో.. ఇంటి నుంచి పారిపోయి తండ్రికి ఇష్టం లేని పెళ్లి చేసుకుంది. కళ్లల్లో పెట్టుకుని చూసిన బిడ్డ చేసిన పనికి.. ఆ తండ్రి గుండె బద్దలయింది. గుండెల మీద నడక నేర్చుకున్న కూతురు.. ఇలా గుండెలపై తన్ని వెళ్లిపోవడాన్ని తండ్రి జీర్ణించుకోలేకపోయాడు. తీవ్ర మనస్థాపానికి గురైన అనూష్ణ తండ్రి.. తన కన్నబిడ్డ చనిపోయిందంటూ ఫ్లెక్సీ వేయించాడు.

బంధువులు అందరినీ పిలిచి.. బిడ్డకు పిండం పెట్టాడు. ఈ ఫొటో, వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమ్మలారా.. అయ్యలారా.. నా బిడ్డ వెళ్లిపోయింది. మంచి కాలేజీలో చదువుతోన్న మా అమ్మాయిని కొందరు ట్రాప్ చేశారు. ఇలా ఎవరూ బతకొద్దు. మీ తల్లిదండ్రులకు అన్యాయం చేయొద్దు. మీ కాళ్లు మొక్కుతా అంటూ ఆ తండ్రి పెడుతున్న కన్నీళ్లు ఇప్పుడు ప్రతీ ఒక్కరి మనసును మెలేస్తున్నాయ్.