ISRO (Aditya L1) : ‘ఆదిత్య ఎల్-1’ ప్రయోగం సక్సెస్.. 170 రోజుల జర్నీలో సవాళ్లు ఇవీ..
సూర్యుడిపై రీసెర్చ్ విషయంలో ఇండియా కంటే కొన్ని దేశాలు ముందంజలో ఉన్నాయి. అమెరికా స్పేస్ ఏజెన్సీ ‘నాసా’, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ‘ఈసా’, జపాన్ స్పేస్ ఏజెన్సీ ‘జాక్సా’, జర్మనీ, చైనాలు ఇప్పటికే వాటి స్పేస్ క్రాఫ్ట్ లను సూర్యుడిపై రీసెర్చ్ కోసం పంపించాయి. అయితే ప్రయోగాల కోసం జపాన్, జర్మనీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లు నాసా హెల్ప్ ను తీసుకున్నాయి.

Few countries are ahead of India in research on the Sun American Space Agency NASA European Space Agency ESA Japanese Space Agency JAXA Germany and China have already sent their space craft for research on the Sun.
మొన్న చంద్రుడు.. ఇవాళ సూర్యుడు.. !! భూమి మనుగడను శాసిస్తున్న సూర్య,చంద్రులలో దాగిన రహస్యాల గుట్టును విప్పడంపై ఇస్రో ఫోకస్ పెట్టింది. ఇవాళ ఉదయం 11.50 నిమిషాలకు శ్రీహరి కోట నుంచి ఇస్రో నిర్వహించిన ‘ఆదిత్య ఎల్-1’ ప్రయోగ ప్రక్రియ సక్సెస్ అయింది. పీఎస్ఎల్వీ శాటిలైట్ లాంచ్ వెహికల్ విజయవంతంగా సూర్యుడి దిశగా జర్నీని కొనసాగిస్తోంది. ఇది దాదాపు 170 రోజుల పాటు జర్నీ చేసి.. సూర్యుడికి, భూమికి మధ్యలో ఉండే లగ్రాంజ్ పాయింట్ (Lagrange Point 1)కు చేరుకోనుంది. ‘ఆదిత్య ఎల్-1’ శాటిలైట్ ఈ పాయింట్ వద్దే తిరుగుతూ .. సూర్యుడిని గమనిస్తూ.. వివరాలను ఇస్రోకు చేరవేయనుంది. సూర్యుడి చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితుల సమాచారాన్ని సేకరించి పంపడమే ‘ఆదిత్య ఎల్-1’ పని.
అంత ఈజీ ఏం కాదు..
అయితే లగ్రాంజ్ పాయింట్ 1 కి చేరుకోవడం అంత ఈజీ ఏం కాదు. మధ్యలో ఎన్నో దశలను అధిగమించాలి. ముందుగా Low Earth ఆర్బిట్‌లోకి లాంచ్ వెహికల్ ప్రవేశిస్తుంది. దీన్నే Earth Centred Orbit Transfer అని పిలుస్తారు. ఈ దశలో ఆదిత్య L1 స్పేస్ క్రాఫ్ట్ మూడుసార్లు భూకక్ష్యలో తిరుగుతుంది. ఈ ట్రాజెక్టరీ Elliptical షేప్‌లోకి వచ్చేంత వరకూ ఇలాగే ప్రదక్షిణలు చేస్తుంది. ఈక్రమంలో భూమి గురుత్వాకర్షణ శక్తిని వాడుకుంటుంది. మూడు సార్లు ఈ ప్రదక్షిణలు పూర్తైన తరవాత ఆదిత్య L1 భూ కక్ష్య వదిలేసి.. సూర్యుడి L1 లేయర్‌వైపు ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. ఈ దశనే క్రూజ్ ఫేజ్ అని పిలుస్తారు. ఎప్పుడైతే భూ గురుత్వాకర్షణ శక్తి పరిధి నుంచి ఆదిత్య L1 వెళ్లిపోతుందే…అక్కడి నుంచి సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి ప్రభావం మొదలవుతుంది. అందుకే ఈ ఫేజ్ చాలా కీలకం.. దానిలో విజయం సాధించడం అత్యవసరం అని శాస్త్రవేత్తలు అంటున్నారు. L1 ఫేజ్ ని దాటితే L1 Halo Orbitలోకి స్పేస్ క్రాఫ్ట్ ప్రవేశిస్తుంది. దీన్నే లగ్రాంజ్ పాయింట్ (Lagrange Point 1) అని పిలుస్తారు. ఇక్కడ భూమి గురుత్వాకర్షణ శక్తి, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి బ్యాలెన్స్ అవుతుంది. అందువల్ల అక్కడ ఆదిత్య L1 స్థిరంగా.. డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఊగుతూ ఉండిపోతుంది. ఆదిత్య ఎల్1 శాటిలైట్ ఇక తన పనని మొదలుపెట్టి.. Visible Emission Line Coronagraph (VELC) సాయంతో సూర్యుడికి సంబంధించిన కీలక వివరాలను సేకరిస్తుంది. రోజుకి 14 వందలకు పైగా సూర్యుడి ఫొటోలు తీసి పంపుతుంది. ఈ ఫొటోల ఆధారంగా సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు అవసరమైన సమాచారాన్ని వడపోస్తారు. Indian Institute of Astrophysics, ఇస్రోతో కలిసి VELC పేలోడ్‌ని తయారు చేసింది.
వాళ్లు రూ.12వేల కోట్లు.. మనం రూ.400 కోట్లు
సూర్యుడిపై రీసెర్చ్ విషయంలో ఇండియా కంటే కొన్ని దేశాలు ముందంజలో ఉన్నాయి. అమెరికా స్పేస్ ఏజెన్సీ ‘నాసా’, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ‘ఈసా’, జపాన్ స్పేస్ ఏజెన్సీ ‘జాక్సా’, జర్మనీ, చైనాలు ఇప్పటికే వాటి స్పేస్ క్రాఫ్ట్ లను సూర్యుడిపై రీసెర్చ్ కోసం పంపించాయి. అయితే ప్రయోగాల కోసం జపాన్, జర్మనీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లు నాసా హెల్ప్ ను తీసుకున్నాయి. ఇప్పటివరకు సూర్యుడి వైపుగా భూమి నుంచి వెళ్లిన స్పేస్ క్రాఫ్ట్ ల సంఖ్య కేవలం 22 (Countries Race To Moon) మాత్రమే. ఇప్పుడు మనం పంపిన ‘ఆదిత్య ఎల్-1’ స్పేస్ క్రాఫ్ట్ 23వది అవుతుంది. ఆదిత్య ఎల్-1 ప్రయోగం కాస్ట్ రూ.400 కోట్లు మాత్రమే. అయితే 2018లో సూర్యుడిపై రీసెర్చ్ కోసం నాసా ప్రయోగించిన ‘పార్కర్ ప్రోబ్’ బడ్జెట్ రూ.12వేల కోట్లు.
సూర్యుడిపై రీసెర్చ్ విషయంలో ఇండియా కంటే కొన్ని దేశాలు ముందంజలో ఉన్నాయి. అమెరికా స్పేస్ ఏజెన్సీ ‘నాసా’, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ‘ఈసా’, జపాన్ స్పేస్ ఏజెన్సీ ‘జాక్సా’, జర్మనీ, చైనాలు ఇప్పటికే వాటి స్పేస్ క్రాఫ్ట్ లను సూర్యుడిపై రీసెర్చ్ కోసం పంపించాయి. అయితే ప్రయోగాల కోసం జపాన్, జర్మనీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లు నాసా హెల్ప్ ను తీసుకున్నాయి.