సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు జనవరి17కు వాయిదా
ఫైబర్ నెట్ కేసు విచారణను సుప్రీంకోర్టు జనవరి 17కు వాయిదా వేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో (Skill development case) 17Aపై తీర్పు పెండింగ్‌లో ఉండటంతో... ఈ కేసు విచారణ కూడా వాయిదా పడుతోంది.
Fiber net Case on Chandrababu: ఫైబర్ నెట్ కేసు విచారణను సుప్రీంకోర్టు జనవరి 17కు వాయిదా వేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో (Skill development case) 17Aపై తీర్పు పెండింగ్‌లో ఉండటంతో… ఈ కేసు విచారణ కూడా వాయిదా పడుతోంది.
ఫైబర్ నెట్ కేసు విచారణను సుప్రీంకోర్టు 2024 జనవరి 17కు వాయిదా వేసింది. ఫైబర్‌నెట్ కేసులో (Fiber Net Case)లో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు సుప్రీంలో పిటిషన్ ఫైల్ చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో 17Aపై తీర్పు పెండింగ్‌లో ఉంది. దాంతో ఈ కేసును కూడా కోర్టు వాయిదా వేస్తూ వస్తోంది. సుప్రీంకోర్టులో జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం ముందు ఫైబర్ నెట్ కేసు విచారణకు వచ్చింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో 17 ఏపై తీర్పును దృష్టిలో పెట్టుకొని మరోసారి పైబర్ నెట్ కేసును జనవరి 17కి వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం తెలిపింది.
పైబర్ నెట్ కేసు గురించి చంద్రబాబు మాట్లాడకుండా చూడాలని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది రంజిత్ కుమార్ కోర్టుకి విజ్ఞప్తి చేశారు. అసలు చంద్రబాబు మాట్లాడటం లేదని ఆయన తరపు సీనియర్ కౌన్సిల్ సిద్ధార్ధ లూథ్రా తెలిపారు. ఏఏజీ, డీజీపీ కలసి ఢిల్లీ, హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం పెట్టి కేసు గురించి మాట్లాడుతున్నారని లూథ్రా అన్నారు. దాంతో రెండు వర్గాలు సంయమనం పాటించాలనీ… ఈ కేసు గురించి మాట్లాడవద్దని సుప్రీంకోర్టు (Supreme court) ధర్మాసనం సూచించింది.