CONGRESS: కాంగ్రెస్‌లో అలజడి.. సీఎం పదవి కోసం సీనియర్ల మధ్య వాగ్వాదం!?
డీకే శివకుమార్ ఆల్రెడీ ఢిల్లీ వెళ్లిపోయారు. రేపు మల్లికార్జున ఖర్గే తెలంగాణ సీఎం పేరు ప్రకటించబోతున్నారు. ఇదిలా ఉంటే రేవంత్‌కు వ్యతిరేకంగా సీనియర్లు పార్టీ హైకమాండ్‌కు అల్టిమేటం జారీ చేశారు అనే వార్త ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా మారింది.
CONGRESS: అలా గెలిచారో లేదో ఇలా కాంగ్రెస్‌లో సీట్ ఫైట్ మొదలయ్యింది. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎంపిక చిలికిచిలికి గాలివానగా మారుతోందనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్‌ను ఎన్నుకునేందుకు ఇవాళ సీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనే విషయంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించారు. రోజంతా మీటింగ్ నిర్వహించినా.. ఎవరి పేరు ప్రకటించాలో తెలియని పరిస్థితి ఏర్పడింది కాంగ్రెస్ పార్టీలో. దీంతో ఆ నిర్ణయాన్ని పార్టీ హైకమాండ్‌కు అప్పగించారు. డీకే శివకుమార్ ఆల్రెడీ ఢిల్లీ వెళ్లిపోయారు.
CONGRESS: కాంగ్రెస్‌లో సస్పెన్స్.. సీఎం ప్రకటన ఇవాళ లేనట్టే..
రేపు మల్లికార్జున ఖర్గే తెలంగాణ సీఎం పేరు ప్రకటించబోతున్నారు. ఇదిలా ఉంటే రేవంత్‌కు వ్యతిరేకంగా సీనియర్లు పార్టీ హైకమాండ్‌కు అల్టిమేటం జారీ చేశారు అనే వార్త ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా మారింది. రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే ఊరుకునేది లేదంటూ పార్టీ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనరసింహ.. అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారని సమాచారం. రేవంత్‌కు సీఎం పదవి ఇచ్చి, శ్రీధర్‌బాబుకు స్పీకర్ పదవి ఇస్తామని చెప్పడంతో ఆయన తీవ్ర ససహనానికి గురయ్యారట. ఖాళీగా అయినా ఉంటా.. కానీ స్పీకర్ పదవి తీసుకోబోనని తేల్చి చెప్పారట. భట్టి విక్రమార్క, సీతక్కకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని చెప్పడంతో భట్టి కూడా అసహనం వ్యక్తం చేశారట. డిప్యూటీ సీఎం పదవి ఇస్తే తనకు ఒక్కడికే ఇవ్వాలని.. ఇద్దరికి ఇస్తే తనకు పదవి వద్దని చెప్పేశారట. కానీ రేవంత్ మాత్రం సీతక్కకు కూడా డిప్యుటీ సీఎం పదవి ఇవ్వాలని కోరడంతో సీనియర్ల మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది.
ఈ వ్యవహారం ఒకరినొకరు తిట్టుకునేవరకూ వెళ్లినట్టు సమాచారం. ఈ వార్తతో ఒక్కసారిగా కాంగ్రెస్ పరిణామాలు మారిపోయాయి. కేసీఆర్‌ను కాదని తిరుగులేని మెజార్టీతో ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం తమ వర్గపోరుతో ఆ అవకాశాన్ని దూరం చేసుకునేలా ఉన్నారంటున్నారు విశ్లేషకులు. ఈ వ్యవహారం అటు తిరిగీ, ఇటు తిరిగీ.. బీఆర్‌ఎస్ పార్టీకి మేలు చేసేలా ఉందని చెప్తున్నారు. రేపు సీఎం పేరు ప్రకటించబోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది.