Srinu Vaitla: శ్రీను వైట్ల రిటర్న్స్ నిలబడతాడా.. తడబడతాడా
ఒకప్పటి స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల ఐదేళ్లుగా ఖాళీగా వున్నాడు. సంవత్సరాలు గడుస్తున్నాయేగానీ.. శ్రీనువైట్ల సినిమా మాత్రం మొదలుకావడం లేదు. అనుకుంది అటకెక్కింది. మరి ప్రచారం జరగుతున్న సినిమా అయినా మొదలవుతుందా?

Film Director Srinu Vaitla Make Moive With Gopichandd Combination
ఒకప్పటి స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల ఐదేళ్లుగా ఖాళీగా వున్నాడు. సంవత్సరాలు గడుస్తున్నాయేగానీ.. శ్రీనువైట్ల సినిమా మాత్రం మొదలుకావడం లేదు. అనుకుంది అటకెక్కింది. మరి ప్రచారం జరగుతున్న సినిమా అయినా మొదలవుతుందా?
టైం బాగుంటే మనం ఏది అనుకుంటే అది జరిగిపోతుంది. బాగోనప్పుడే జాగ్రత్తగా వుండాలి. అనుకున్నదేదీ వర్కవుట్ కాదు. వరుస ఫ్లాపుల్లో వున్న శ్రీనువైట్ల ఎన్నో అనుకున్నాడు. ఒక్కటీ కాలేదు. ఢీ సీక్వెల్ ఢీ అండ్ ఢీతో ఫామ్‌లోకి వద్దామనుకుంటే అదీ జరగలేదు. దీంతో మరో హీరోను వెతుక్కుని గోపీచంద్‌తో సినిమా ప్లాన్ చేశాడు శ్రీనువైట్ల. దూకుడు.. రెడీ.. వెంకీ..దుబాయ్ శ్రీను వంటి ఎన్నో సూపర్‌హిట్స్ ఇచ్చిన దర్శకుడు మెగాఫోన్‌కూ దూరమయ్యాడు. రెండేళ్ల క్రితం విష్ణు హీరోగా ఎనౌన్స్ చేసిన ‘ఢీ అండ్ ఢీ’ ఇంతవరకు మొదలుకాలేదు. ఈ ప్రాజెక్ట్ అటకెక్కడంతో గోపీచంద్‌ను లైన్లో పెట్టాడు శ్రీనువైట్ల
యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే జానర్‌ను ఓ రేంజ్‌కు తీసుకెళ్లిన దర్శకుడు శ్రీనువైట్ల. ఆతర్వాత వచ్చిన యంగ్ బ్యాచ్… అనిల్ రావిపూడి.. త్రినాథరావు నక్కిన శ్రీనువైట్లనే ఫాలో అవుతూ.. హిట్స్ అందుకున్నారు. అయితే.. శ్రీనువైట్ల మాత్రం.. బాక్సాఫీస్ వద్ద మిస్ ఫైర్ అవుతున్నాడు. ఆగడు.. బ్రూస్లీ.. మిస్టర్.. అమర్ అక్బర్ ఆంటోని ఫ్లాప్స్‌తో స్టార్ ఇమేజ్ ఒక్కసారిగా డౌన్‌ఫాల్ అయింది. 2018లో వచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ తర్వాత శ్రీనువైట్ల నుంచి మరో సినిమా రాలేదు. గోపీచంద్‌మూవీ ఎప్పుడు సెట్స్‌పైకి వస్తుందో చూడాలి మరి.