Sai Pallavi Marriage: సాయిపల్లవి పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు..
టాలీవుడ్ పవర్ స్టార్ సాయిపల్లవి పెళ్లైపోయిందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇంతకూ దీనిపై స్పందించిన దర్శకుడు ఏమన్నాడంటే..

Film director Venu Udugula gave clarity on Sai Pallavi's marriage
సాయిపల్లవి ఈ పేరు వినగానే తెలుగింటి ఆడబిడ్డ అనేలా ఉంటుంది. ఢీ డ్యాన్స్ షో తో వెండితెరపై అడుగు పెట్టి మొదటి సినిమా ఫిదాతోనే అందరి మనసులను ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ. పదహారణాల తెలుగు పిల్లను చూసి ఎంతకాలమైందో అనేలా ఆమె నటన ఆకట్టుకుంది. అయితే తాజాగా తెలుగు చిత్రాలకు దూరంగా ఉంటూనే కోలీవుడ్, మల్లూవుడ్, బాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది ఈ భామ. తనకు నచ్చే కథ వచ్చే వరకూ సినిమాలు చేసేందుకు ఇష్టపడదు. అందుకే తెలుగు ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకుంది.
ఇదిలా ఉంటే తాజాగా సాయి పల్లవి పెళ్లి అయిపోయిందని సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. దీనికి బలం చేకూర్చేలా పూలదండలు మార్చుకుని భార్యాభర్తలు పక్కపక్కనే నిలుచున్నట్లు ఉంటే ఫోటో ఒకటి వైరల్ గా మారింది. దీంతో నిజమే అనుకుని షాక్ కి గురైయ్యారు ఆమె అభిమానులు. దీనిపై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు వేణు ఉడుగుల. శివకార్తికేయన్ తాజా మూవీ పట్టాలెక్కబోతున్న సందర్భంగా ముహూర్తం కార్యక్రమంలో తీసుకున్న ఫోటోగా తెలిపాడు. చిత్ర యూనిట్ మొత్తం పూలదండలు మెడలో వేసుకుని పూజా కార్యక్రమాలు చేసేలా ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్లో సాయిపల్లవి, దర్శకుడు పక్కపక్కనే ఉండటంతో పెళ్లైపోయిందన్న వార్త ఫేస్ బుక్ లో చర్కర్లు కొట్టింది. దీనిని ఖండిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చారు దర్శకుడు వేణు.
T.V.SRIKAR