Pawan Kalyan, Nani : పవన్‌కు మద్దతుగా నాని…
జనసేన (Janasena) అధినేత పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు రోజు రోజుకూ సినీ ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతోంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను గెలిపించేందుకు ఇప్పటికే చాలా మంది జబర్ధస్త్ కమెడియన్స్ (Jabarthest Comedians), యాక్టర్స్ పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని కూడా పవన్ కళ్యాణ్‌కు తన మద్దతు ప్రకటించారు.

Film star hero natural star Nani who supported Pawan in Pithapuram...
జనసేన (Janasena) అధినేత పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు రోజు రోజుకూ సినీ ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతోంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను గెలిపించేందుకు ఇప్పటికే చాలా మంది జబర్ధస్త్ కమెడియన్స్ (Jabarthest Comedians), యాక్టర్స్ పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని కూడా పవన్ కళ్యాణ్‌కు తన మద్దతు ప్రకటించారు. ‘డియర్ పవన్ కళ్యాణ్ గారు.. మీరు పెద్ద రాజకీయ యుద్దాన్ని ఎదుర్కోబోతున్నారు. ఈ రాజకీయ యుద్ధంలో మీరు అనుకున్న విజయం సాధిస్తారని, ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తారని సినీ ఫ్యామిలీకి చెందిన సభ్యుడిగా ఆశిస్తున్నా. నాతోపాటు అందరూ మీకు తోడుగా ఉంటారని భావిస్తున్నా. ఆల్ ది వెరీ బెస్ట్ సర్’ అని నేచురల్ స్టార్ నాని ట్వీట్ చేశారు.
మరోపైపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఇప్పటికే హీరో సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వంటి హీరోలతో పాటుగా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, జానీ మాస్టర్ వంటి సెలబ్రిటీలు సైతం ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్‌ను గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. మెగాస్టార్ చిరంజీవి సైతం సోషల్ మీడియా వేదికగా తమ్ముడి కోసం ప్రచారం ప్రారంభించారు. ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరిగా పుట్టినప్పటికీ.. మంచి చేయాలనే విషయంలో ముందుంటాడని చెప్తూ తమ్ముడిని ఆకాశానికెత్తేశాడు మెగాస్టార్. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలని అనుకుంటారని.. కానీ అధికారం లేకుండానే తన సొంత సంపాదనతో కౌలు రైతుల కన్నీళ్లు తుడిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ చెప్పారు.
పవన్ కళ్యా్ణ్ తన గురించి కంటే జనం గురించే ఎక్కువగా ఆలోచిస్తారని.. తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడే కదా ప్రజలకు కావాల్సిందని అనిపిస్తోందన్నారు. జనం కోసం జనసైనికుడు అయ్యాడని.. తను నమ్మిన సిద్ధాంతం కోసం అంకితమయ్యారని పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్‌కు ఓటేసి గెలిపించాలని కోరారు. త్వరలోనే ఆయన పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌కు ప్రచారం చేస్తారనే టాక్ కూడా జనసేనలో నడుస్తోంది. ఇలా వరుసగా సినీ ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ వస్తుండటంతో కూటమి నేతల్లో కొత్త జోష్ కనిపిస్తోంది.
నా తమ్ముడిని గెలిపించండి.. #APAssemblyElections #Janasena #PawanKalyan #Chiranjeevi #Janasena #YCP #Nagababu @JSPVeeraMahila @JanaSenaParty @KChiruTweets @AlwaysRamCharan @NagaBabuOffl pic.twitter.com/yimj3TqIqV
— Dial News (@dialnewstelugu) May 7, 2024