Ayodhya Ram Mandir : రాముడి శిలను తీసిన వ్యక్తికి జరిమానా.. కాంగ్రెస్ పాలనలో ఇంతే అంటూ ట్రోలింగ్…
5వందల ఏళ్ల నాటి అయోధ్య రామమందిర కల.. ఎట్టకేలకు సాకారం అయింది. దేశమంతా ఆర్తి నిండిన కళ్లతో చూసిన వేళ.. ప్రపంచం అంతా ఆసక్తిగా గమనించిన సమయంలో.. బాలరాముడి ప్రాణప్రతిష్టం ఘనంగా జరిగింది. దశరథ రాముడు బాలరామునిగా తిరిగి అయోధ్యకు చేరుకున్నారని.. దేశమంతా ఆనందంలో మునిగిపోతోంది.
5వందల ఏళ్ల నాటి అయోధ్య రామమందిర కల.. ఎట్టకేలకు సాకారం అయింది. దేశమంతా ఆర్తి నిండిన కళ్లతో చూసిన వేళ.. ప్రపంచం అంతా ఆసక్తిగా గమనించిన సమయంలో.. బాలరాముడి ప్రాణప్రతిష్టం ఘనంగా జరిగింది. దశరథ రాముడు బాలరామునిగా తిరిగి అయోధ్యకు చేరుకున్నారని.. దేశమంతా ఆనందంలో మునిగిపోతోంది. ఐతే బాలరాముని విగ్రహాన్ని ముద్దుముద్దుగా చెక్కిన శిల్పికి… ఆ శిలను అందించిన వ్యక్తి మాత్రం కన్నీళ్లు మిగిలాయ్. కర్ణాటకకు చెందిన శ్రీనివాస్ నటరాజ్ అనే వ్యక్తి క్వారీ కాంట్రాక్టర్ పనిచేస్తున్నాడు. తన స్నేహితుడైన అరుణ్ యోగిరాజ్… బాలరాముని విగ్రహాన్ని తయారుచేయాలని అనుకుంటున్నట్లు తెలుసుకున్న ఆయన.. ఎలాగైనా అరుణ్‌కు సాయం చేయాలనుకున్నాడు.
తాను పని చేయిస్తున్న పొలంలో బయటపడిన ఒక కృష్ణ శిలను అరుణ్‌కి ఇచ్చారు. ఆ శిలను అరుణ్ శిల్పంగా మార్చడం.. అయోధ్యలో ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ట జరగడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఐతే అతి పురాతనమైన కృష్ణ శిలను అక్రమ మైనింగ్ ద్వారా వెలికి తీయడంతో.. శ్రీనివాస్ నటరాజ్‌కు కర్ణాటక ప్రభుత్వం 80వేల రూపాయల జరిమానా విధించింది. ఐతే తాను ఎలాంటి అక్రమ మైనింగ్ చేయలేదని శ్రీనివాస్ చెప్తున్నా.. అధికారులు పట్టించుకోలేదు. తన భార్య బంగారు నగలను తాకట్టు పెట్టి.. ఆ డబ్బును చెల్లించినట్లు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఐతే ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీనివాస్‌కు విధించిన జరిమానా వ్యవహారం.. నెమ్మదిగా రాజకీయ రంగు పులుముకుంటోంది.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు దూరంగా ఉన్న కాంగ్రెస్.. రాములోరి ప్రతిమ కోసం శిలను అందించిన వ్యక్తిని కావాలని టార్గెట్ చేస్తోందని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంతే అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఐతే రాముడి విగ్రహానికి వాడిన శిల ఇది కాదని.. అది శాలిగ్రామ్ శిల అని.. నేపాల్ నుంచి తీసుకువచ్చారని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఏమైనా ఈ జరిమానా వ్యవహారం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపుతోంది.