Finland: ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఏంటో తెలుసా?
ప్రపంచంలో సంతోషకరమైన దేశంగా ఫిన్‌లాండ్ నిలిచింది. వందకు పైగా దేశాల్లో సర్వే నిర్వహించగా.. అందులో ఫిన్‌లాండ్ టాప్‌లో నిలిచింది. ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాలలో ఇదీ ఒకటి.

Finland has been proven to be the happiest country in the world in over a hundred surveys
ప్రతి పౌరుడు ఆర్థిక భద్రతతో పాటు అనేక హక్కులు, సౌకర్యాలను పొందారు. ఫిన్లాండ్ స్థిరమైన, సురక్షితమైన దేశం. ఇక్కడ మొత్తం జనాభా 55 లక్షలు. ఇక్కడ పోలీసు, ఇంటర్నెట్ భద్రత ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. చట్టాన్ని కచ్చితంగా పాటిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ పరిపాలనగా ఫిన్‌లాండ్‌కు పేరుంది. ఇక్కడ అవినీతి తక్కువ. ఫిన్లాండ్ బ్యాంకులు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనవి. ప్రపంచంలో నిరాశ్రయులైన ఎవరూ లేని దేశం ఫిన్‌లాండ్ మాత్రమే. ఫిన్‌లాండ్ విద్యావిధానం ప్రపంచంలోనే టాప్.
ప్రపంచంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన దేశాల్లో ఇది కూడా ఒకటి. 2018 నుంచి వరుసగా ఫిన్‌లాండ్ మొదటి స్థానంలో నిలుస్తోంది. విస్తారమైన అడవులు, సరస్సుల ఉన్న దేశంలో.. సక్రమంగా పనిచేసే ప్రజా సేవలు, అధికారంపై విస్తృత విశ్వాసం, తక్కువ స్థాయి నేరాలు, అసమానతలకు కూడా ఫిన్‌లాండ్ ఫేమస్. సంతోషకరమైన దేశాల జాబితాలో టాప్ 100లో కూడా భారత్ లేదు. భారత్ 126వ స్థానంలో ఉండగా.. చైనా 64, పాకిస్తాన్ 108, బంగ్లాదేశ్ 118 ప్లేసులో ఉన్నాయ్. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మనదేశం కంటే ముందు ఉండడమే చర్చకు కారణం అవుతోంది. తాలిబన్ల పాలనలో ఉన్న ఆప్ఘానిస్తాన్ 137వ స్థానంలో ఉంది.