Kaushik Reddy: పాడి కౌశిక్‌రెడ్డిపై కొత్త కేసు..

కౌంటింగ్‌ సందర్భంగా కౌశిక్‌రెడ్డి ఆందోళన చేస్తూ పోలీసులపై జులుం ప్రదర్శించారు. కౌశిక్ తీరుపై సీపీ అభిషేక్‌ మహంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై కేసు నమోదు చేశారు. ఇదంతా ఎలా ఉన్నా.. పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఎమోషనల్ ఎన్నికల ప్రచారం వర్క్ అవుట్ అయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 4, 2023 | 05:52 PMLast Updated on: Dec 04, 2023 | 5:52 PM

Fir Filed Against Brs Mla Kaushik Reddy In Huzurabad

Kaushik Reddy: పాడి కౌశిక్‌రెడ్డికి దూకుడెక్కువ.. అందుకే జనాలకు దూరం ఎక్కువ అనే పేరు ఉంది. ఓట్లు చీలో.. అదృష్టమో.. ఆయన కూతురు సెంటిమెంట్‌ వర్కౌట్ అయిందో.. లేదంటో ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌కు జనాలు భయపడ్డారో కానీ.. హుజురాబాద్‌లో ఈటల కోటను బద్దలుకొట్టారు పాడి కౌశిక్‌ రెడ్డి. ఐతే ఆయనను వివాదాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయ్. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్ టూటౌన్ పీఎస్‌లో కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్స్‌ 353, 290, 506 కింద కేసు నమోదు చేశారు.

CONGRESS: రిజర్వుడ్ స్థానాల్లో కాంగ్రెస్ పాగా.. అధిక సీట్లు గెలుచుకున్న హస్తం..

కౌంటింగ్‌ సందర్భంగా కౌశిక్‌రెడ్డి ఆందోళన చేస్తూ పోలీసులపై జులుం ప్రదర్శించారు. కౌశిక్ తీరుపై సీపీ అభిషేక్‌ మహంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై కేసు నమోదు చేశారు. ఇదంతా ఎలా ఉన్నా.. పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఎమోషనల్ ఎన్నికల ప్రచారం వర్క్ అవుట్ అయింది. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్‌పై విజయం సాధించడానికి పాడి కౌశిక్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారు. గతంలో ఎమ్మెల్సీగా ఎన్నిక అయినా.. తనకు కిక్కు రాలేదని స్పష్టం చేశారు. అయితే ఎన్నికలకు ముందు కమలాపూర్‌లో కౌశిక్ రెడ్డి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారు. మీరు ఓటేసి దీవిస్తే నాలుగో తేదిన జైత్రయాత్ర చేస్తా.. లేదంటే కుటుంబ సభ్యులంతా కలిసి చనిపోతామని ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్ చేశారు.

నా జైత్రయాత్రో.. మా శవయాత్రో అంటూ.. ఓటర్లను ఎమోషనల్‌గా కార్నర్‌ చేశాడు. చంపుకొంటారా.. సాదుకుంటారా.. కుటుంబ సభ్యులం ముగ్గురం ఆత్మహత్య చేసుకుంటామని సంచలన కామెంట్స్ చేశారు. కౌశిక్ రెడ్డి కూతురు శ్రీనిక చేసిన ప్రచారాలు కూడా ఫలించాయి. దీంతో తన చిరకాల కోరిక ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు కౌశిక్ రెడ్డి.