Nampally Fire Accident : నాంపల్లి అగ్ని ప్రమాద మృతులకు 5 లక్షల పరిహారం… కేటీఆర్ ప్రకటన..కేంద్రం నుంచి ఆర్ధిక సాయం.. కిషన్ రెడ్డి
ఈ అగ్ని ప్రమాదంలో 9 మంది మరణించగా.. ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి చెందారు. మృతులు అజం (58), రెహానా (50), సమీన్ (32), నికత్ సుల్తానా (55), హసీబ్ (26) తహూరా (35), తూబ (6), తరూబా (13) జకీర్ హుస్సేన్ (66) - ఆస్పత్రిలో 10 మందికి చికిత్స అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల పరిహారం ప్రటించారు మంత్రి కేటీఆర్.
నాంపల్లిలోని బజార్ ఘాట్ లోని డీజిల్ మెకానిక్ గ్యారేజ్ జరిగిన అగ్నిప్రమాదం ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తిం చేశారు. ప్రమాద బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఉన్నత అధికారులకు సీఎం ఆదేశించారు.
ప్రమాద స్థలం వద్దకు చేరుకున్న మంత్రి కేటీఆర్. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. దీపావళి తర్వాత ఉదయం షార్ట్ సర్క్యూట్ వల్లో లేక ఫైర్ క్రేకర్ వల్లో అగ్గి రవ్వలు రేగిరి, అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చన్న కేటీఆర్.. రసాయనాలను భవన సెల్లార్లో నిల్వ ఉంచడం వల్ల ఇది జరిగిందని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు కేటీఆర్. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఇప్పటికే.. ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అత్యవసరం అయితే మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి కూడా తరలిస్తామని అన్నారు కేటీఆర్.
Telangana Elections : సామాజిక న్యాయంతో ఓట్ల వేట.. మొన్న బీసీలకు – నిన్న ఎస్సీలు.
ఈ అగ్ని ప్రమాదంలో 9 మంది మరణించగా.. ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి చెందారు. మృతులు అజం (58), రెహానా (50), సమీన్ (32), నికత్ సుల్తానా (55), హసీబ్ (26) తహూరా (35), తూబ (6), తరూబా (13) జకీర్ హుస్సేన్ (66) – ఆస్పత్రిలో 10 మందికి చికిత్స అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల పరిహారం ప్రటించారు మంత్రి కేటీఆర్.
కేంద్రమంత్రి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నాంపల్లి ప్రమాద స్థలిని పరిశీలించారు . ప్రమాదంపై ఆరా తీసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మృతుల కుటుంబాలకు కేంద్రం నుంచి పీఎం కేర్ రిలిఫ్ ఫండ్ ద్వారా ఆర్ధిక సాయం అందిస్తాం అని హామీ ఇచ్చారు కేంద్ర మంత్రి.
ఈ అగ్నిప్రమాదం జరిగిన సంఘటన స్థలానికి కాంగ్రెస్ నాంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ బాధితులను పరామర్శించేందుకు వస్తుండగా.. ఫిరోజ్ ఖాన్ ను ఘటనాస్థలిలో ఎంఐఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఒక్కడ కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది కాంగ్రెస్, MIM వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరిస్థితి మరింత దారుణం అవ్వకు మునుపే బజార్‌ఘాట్ అగ్నిప్రమాదం స్థలం వద్ద ఇరు పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.
S.SURESH