Fire accident : పంజాగుట్ట ఎర్రమంజిల్ లో అగ్ని ప్రమాదం..
హైదరాబాద్ నగర నడిబొడ్డున మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పంజాగుట్ట ఎర్రమంజిల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం ఓ భవనంలోని నాలుగో అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. కాగా ఈ ఘటన సమయంలో అందులో నివసిస్తున్న కొంత మంది ప్రాణ భయంతో బయటికి వచ్చి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Fire accident in Panjagutta Erramanzil..
హైదరాబాద్ నగర నడిబొడ్డున మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పంజాగుట్ట ఎర్రమంజిల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం ఓ భవనంలోని నాలుగో అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. కాగా ఈ ఘటన సమయంలో అందులో నివసిస్తున్న కొంత మంది ప్రాణ భయంతో బయటికి వచ్చి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన సమాచారం ప్రస్తుతానికి స్పష్టత లేదు. మరోవైపు ఘటన నేపథ్యంలో పంజాగుట్ట ఏరియాలో భారీగా ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. అదే భవనంలో ఆరో అంతస్థులో చికుకున్న ఓ కుటుంబాన్ని శ్రావణ్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ రక్షించారు. దీంతో ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ ప్రమాదం ఎలా జరిగింది అని ఇంకా స్పష్టత రాలేదు.. గ్యాస్ సిలిండర్ లీక్ కారణమా..? విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమా..? అనేది తెలియాల్సి ఉంది.