Jammu Kashmir : జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పులు.. ఉగ్రవాది హతం
జమ్మూ కశ్మీర్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. కుప్వారా జిల్లాలో నియంత్ర రేఖ వెంబడి పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ జరిపిన దాడిని మన సైన్యం భగ్నం చేసింది.
జమ్మూకశ్మీర్‌లోని కుప్వారాలో భారత సైన్యం… పాక్ సైన్యం మధ్య ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలుస్తుంది. ఉత్తర కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖపై మచల్(కుప్వారా) సెక్టార్‌లో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్(BAT) జరిపిన దాడిని భారత సైనికులు భగ్నం చేశారు. BATలో పాల్గొన్న ఒక ఉగ్రవాది మరణించగా.. ముగ్గురు సైనికులు గాయపడ్డారు. ఈ కుట్ర వెనుక ఐసిస్ హస్తం ఉందని తెలుస్తోంది.
జమ్మూ కశ్మీర్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. కుప్వారా జిల్లాలో నియంత్ర రేఖ వెంబడి పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ జరిపిన దాడిని మన సైన్యం భగ్నం చేసింది. ఈ క్రమంలో అక్కడ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ సైనికుడు మరణించగా.. ఆర్మీ మేజర్ సహా నలుగురు గాయపడ్డారు. ఈ ఆపరేషన్‌లో ఓ పాకిస్థానీ ఉగ్రవాదిని మన సైన్యం మట్టుబెట్టింది. శనివారం తెల్లవారుజామున మచల్ సెక్టార్‌లోని కుంకడి ఫార్వర్డ్ పోస్ట్ వైపు వెళ్తున్నవారిని భద్రతా దళాలు పసిగట్టాయి. దీంతో వారిని ప్రశ్నించేలోపే.. పాక్ ఆర్మీకి చెందిన బ్యాట్ స్క్వాడ్ కాల్పులు జరిపి వెనక్కి పరుగులు తీసింది. దీంతో అప్రమత్తమైన భారత భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. దాదాపు మూడు గంటల పాటు ఇరువైపులా కాల్పులు కొనసాగాయి.