TDP Candidates : ఫిబ్రవరి 4 టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా.. ఈ జిల్లాల వారికే తొలి విడత
ఏపీలో రాష్ట్ర రాజకీయం (AP Politics) రసవంతగా మారింది. ప్రధాన పార్టీలు అన్ని కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికలు సిధ్దం అయ్యాయి. దీంతో తెలుగు దేశం పార్టీ కూడా రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రా.. కదలిరా పేరుతో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడు, చంద్రబాబు నాయుడు (Chandrababu) బహిరంగ సభలను నిర్వహిస్తూ వస్తోన్నారు.

First list of TDP candidates on February 4.. The first phase is for these districts
ఏపీలో రాష్ట్ర రాజకీయం (AP Politics) రసవంతగా మారింది. ప్రధాన పార్టీలు అన్ని కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికలు సిధ్దం అయ్యాయి. దీంతో తెలుగు దేశం పార్టీ కూడా రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రా.. కదలిరా పేరుతో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడు, చంద్రబాబు నాయుడు (Chandrababu) బహిరంగ సభలను నిర్వహిస్తూ వస్తోన్నారు. తిరువూరు, గుడివాడ, మండపేట, పీలేరు, పత్తికొండ, అరకు, ఉరవకొండ, నెల్లూరు.. వంటి చోట్ల బహిరంగ సభలు ముగిశాయి. ఈ పర్యటనలో భాగంగానే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడా తెలుగుదేశం పార్టీ పూర్తి చేసింది.
ఫిబ్రవరి 4వ తేదీన దీన్ని విడుదల చేయనుంది. ఒకే సారి తొలి జాబితాలో 35 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి పుట్టపర్తి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల అభ్యర్థులను తొలి విడతలో ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ తొలి జాబితాలో టీడీపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Achchennaidu), నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), గంటా శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మకాయల చినరాజప్ప, నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, పయ్యావుల కేశవ్, పరిటాల సునీత / పరిటాల శ్రీరామ్, ఆనం రామనారాయణ రెడ్డి.. వంటి నేతలు ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇక ఎన్నికల ఎక్కువ సమయం లేకపోవడంతో అభ్యర్థుల జాబితాను వెల్లడించడంలో ఎలాంటి జాప్యం చేయకూడదని టీడీపీ (TDP) అగ్ర నాయకత్వం భావిస్తోంది.
కాగా ఇప్పిటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. “సిద్ధం” పెరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా భీమిలీలో లక్షలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మధ్య ఎన్నికల ప్రచార శంఖారావాన్ని సీఎం జగన్ పూరించాడు.