SANTHI SWAROOP : శాంతి స్వరూప్ కన్నుమూత
తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. ఆయనకు 2 రోజుల క్రితం గుండెపోటు రావడంతో హైదరాబాద్ లో యశోద హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు కుటుంబసభ్యులు. ట్రీట్మెంట్ తీసుకుంటూ శుక్రవారం మృతి చెందారు. తెలుగులో మొదటిసారి వార్తలు చదివిన న్యూస్ రీడర్ గా శాంతి స్వరూప్ కి గుర్తింపు ఉంది. 1983 నుంచి దూరదర్శన్ లో న్యూస్ రీడర్ గా పనిచేశారు.
తొలి తెలుగు న్యూస్ రీడర్ (News reader) శాంతి స్వరూప్ (Shanti Swarup) కన్నుమూశారు. ఆయనకు 2 రోజుల క్రితం గుండెపోటు రావడంతో హైదరాబాద్ లో యశోద హాస్పిటల్ (Yashoda Hospital) కి తరలించి చికిత్స అందిస్తున్నారు కుటుంబసభ్యులు. ట్రీట్మెంట్ తీసుకుంటూ శుక్రవారం మృతి చెందారు. తెలుగులో మొదటిసారి వార్తలు చదివిన న్యూస్ రీడర్ గా శాంతి స్వరూప్ కి గుర్తింపు ఉంది. 1983 నుంచి దూరదర్శన్ లో న్యూస్ రీడర్ గా పనిచేశారు.
దూరదర్శన్ వచ్చిన కొత్తలో తెలుగులో వార్తల కోసం జనం ఎదురు చూసేవారు. అప్పట్లో శాంతి స్వరూప్ మొదటిసారిగా వార్తలు చదివారు. 1983 నవంబర్ 14 నాడు దూరదర్శన్ ఛానెల్ లో తెలుగులో మొదటిసారిగా ఆయన వార్తలు చదవడం మొదలుపెట్టారు. 10యేళ్ళ పాటు టెలీ ప్రాంప్ట్రర్ లేకుండానే… పేపర్లు చూసుకుంటూ వార్తలను తెలుగులో చాలా స్పష్టంగా చదివేవారు శాంతి స్వరూప్. అప్పటి తరం వాళ్ళు ఇప్పటికీ మర్చిపోలేని వ్యక్తి. ఎన్నో రోజుల పాటు న్యూస్ బులెటిన్స్ చూసిన అనుభవం వాళ్ళది. ఇప్పటికీ చాలామంది న్యూస్ రీడర్లు… శాంతి స్వరూప్ ని తమ గురువుగా భావిస్తుంటారు.
24 గంటల న్యూస్ బులెటిన్స్ వచ్చాక ఆయన ఈ రంగంలో లేరు. వార్తలు చదవొద్దు… వార్తలు చెప్పండి… అని ఈతరం యాంకర్లకు ఆయన సూచనలు చేస్తుండేవారు. శాంతి స్వరూప్ భార్య రోజా రాణి కూడా న్యూస్ రీడర్ గా పనిచేశారు. వీళ్ళకి ఇద్దరు పిల్లలు. సాహిత్యంపై ఎంతో పట్టు ఉన్న ఆయన… భోపాల్ గ్యాస్ దుర్ఘటనపై రాతి మేఘం నవల రాశారు. క్రికెట్ మీద ఇష్టంతో క్రేజ్, సతీ సహగమనం దురాచారానికి వ్యతిరేకంగా అర్థాగ్ని అనే నవలలు రాశారు. 2011లో దూరదర్శన్ నుంచి రిటైర్డ్ అయ్యారు. యాంకరింగ్ లో లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు అందుకున్నారు శాంతిస్వరూప్. శాంతి స్వరూప్ మృతికి ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొలి తరం న్యూస్ రీడర్ గా అందరికీ సుపరిచితులైన వ్యక్తిగా గుర్తుండి పోతారని అంటున్నారు.