Kirana Grand Hotel : చికెన్‌లో ఈగలు.. ఇడ్లీలో పురుగులు.. ఇవేం హోటల్స్‌రా నాయనా
సిటీలో బీజీ లైఫ్ కారణంగా చాలా మంది ఇళ్లలో వండుకోవడం తగ్గించేశారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవాళ్లు దాదాపుగా పుడ్ డెలివెరీ యాప్స్, హోటల్స్ మీదే ఆధారపడుతున్నారు. ఇలా కస్టమర్ ఫ్లో పెరగడంతో డబ్లుకు కక్కుర్తిపడి నాసిరకం ఫుడ్ సప్లై చేస్తున్నారు కొందరు దుర్మాగులు.
సిటీలో బీజీ లైఫ్ కారణంగా చాలా మంది ఇళ్లలో వండుకోవడం తగ్గించేశారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవాళ్లు దాదాపుగా పుడ్ డెలివెరీ యాప్స్, హోటల్స్ మీదే ఆధారపడుతున్నారు. ఇలా కస్టమర్ ఫ్లో పెరగడంతో డబ్లుకు కక్కుర్తిపడి నాసిరకం ఫుడ్ సప్లై చేస్తున్నారు కొందరు దుర్మాగులు. రీసెంట్‌గా రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌లో ఉన్న కిరానా గ్రాండ్ హోటల్ (Kirana Grand Hotel) లో ఇలాంటి ఘనటే జరిగింది. కిరానా గ్రాండ్ హోటల్ నుంచి చికెన్ 65 తీసుకెళ్లిన ఓ కస్టమర్ అందులో పురుగులు ఉండటాన్ని గమనించాడు. వెంటనే ఫుడ్ తీసుకుని హోటల్‌కు వెళ్లి ఇదేంటన్న ప్రశ్నిస్తే హోటల్ ఓనర్స్ పొంతన లేని సమాధానాలు చెప్పారట.
గట్టిగా మాట్లాడితే ఏం చేస్తావ్ ఏం చేస్తావో చేసుకో అంటూ బెదిరించారట. దీంతో ఫుడ్ సేఫ్టీ (Food safety) అధికారులకు కంప్లైంట్ ఇచ్చాడు ఆ కస్టమర్. హోటల్‌కు వెళ్లి చెకింగ్ నిర్వహించిన అధికారులు హోటల్‌లోని ఫ్రిడ్జ్‌లో కుల్లిపోయిన చికెన్ (Chicken), మటన్ ఉండటాన్ని గుర్తించారు. కొన్ని రోజుల నుంచి ఈ హోటల్ వాళ్లు ఇలాంటి ఫుడ్ సప్లై చేస్తున్నారని తెలియడంతో హోటల్‌కు 30 వేలు ఫైన్ వేశారు. ఇది జరిగిన కొన్ని రోజులకే తొండుపల్లిలో ఉన్న ఉడిపి ఉపహార్ హోటల్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. అక్కడ ఇడ్లీ పార్శిల్ తీసుకున్న ఓ కస్టమర్ అందులో పురుగులు ఉండటాన్ని గమనించాడు.
ఈ సమాచారం అందుకున్న మున్సిపల్ అధికారులు హోటల్‌కు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి క్లీన్‌నెస్ లేకుండా పురుగులు ఈగల మధ్యే ఫుడ్ వండుతున్నారు హోటల్ మేనేజ్‌మెంట్ దీంతో ఆ హోటల్‌కు కూడా పెనాల్టీ విధించారు. ఇలాంటి ఘటనలు రోజు రోజుకూ పెరిగిపోతుండటంతో కఠిన చర్యలు తీసుకోవాలని పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారు. డబ్బు కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకునే ఇలాంటి వాళ్లు ఫుడ్ లైసెన్స్ రద్దు చేసి హోటల్స్ సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.