TEAM INDIA FLIGHT 0407 : క్రికెటర్ల కోసం విమానం మళ్ళింపు.. ఎయిరిండియాపై డీజీసీఏ ఎంక్వైరీ
టీ20 వరల్డ్ కప్ గెలుచుకొని భారత క్రికెటర్లు ఫైనల్ గా ఇంటికి చేరారు. బార్బడోస్ లో హరికేన్ ఎఫెక్ట్ తో ఇంటర్నేషనల్ ఫ్లయిట్స్ రద్దయ్యాయి.
టీ20 వరల్డ్ కప్ గెలుచుకొని భారత క్రికెటర్లు ఫైనల్ గా ఇంటికి చేరారు. బార్బడోస్ లో హరికేన్ ఎఫెక్ట్ తో ఇంటర్నేషనల్ ఫ్లయిట్స్ రద్దయ్యాయి. వెదర్ ఎఫెక్ట్ తో బార్భడోస్ లోనే చిక్కుకుపోయారు మన క్రికెటర్లు. ఈనెల 1నే ఇండియాకి రావల్సిన క్రికెటర్లు మూడు రోజులు ఆలస్యంగా ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగడటంతో… ఎయిరిండియా ప్రయాణీకుల విమానాన్ని రద్దు చేసి క్రికెటర్ల కోసం పంపింది. ఇదే ఇప్పుడు వివాదస్పదమైంది.
నెవార్క్ నుంచి ఢిల్లీకి నడిచే ఎయిర్ ఇండియా విమానాన్ని రద్దు చేసి… దాన్ని బార్భడోస్ కి పంపారు. ఇలా ఉన్నట్టుండి నెవార్క్ – ఢిల్లీ సర్వీస్ రద్దు చేయడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎయిర్ ఇండియా చర్యలపై DGCA కు కంప్లయింట్ చేశారు. దాంతో ఫ్లయిట్ రద్దుపై విచారణకు ఆదేశించింది DGCA. నెవార్క్ నుంచి ఢిల్లీకి వచ్చే విమానాన్ని సడన్ గా రద్దు చేసినప్పుడు… తమకు ఆల్టర్నేట్ గా ఎలాంటి చర్యలు చేపట్టలేదని ప్రయాణీకులు మండిపడుతున్నారు. క్రికెటర్లను స్వదేశానికి తీసుకురావడానికి BCCI అధికారులతో కలసి చార్టర్ ఆపరేషన్ కింద విమానం పంపామంటున్నారు అధికారులు. నెవార్క్ ప్రయాణీకులకు మరో ఫ్లయిట్ ఏర్పాటు చేశాకే… క్రికెటర్లకు మళ్ళించామని చెబుతున్నారు.
విమానం కోసం వెయిట్ చేస్తున్న కొందరు ప్రయాణీకులను రోడ్డు మార్గంలో నెవార్క్ నుంచి న్యూయార్క్ కి తీసుకొచ్చి అక్కడ వేరే ఫ్లయిట్ ఎక్కించామని అంటున్నారు. కానీ ప్రయాణీకులు మాత్రం తమకు ఎలాంటి విమానం కేటాయించలేదు… ఎయిరిండియా అధికారులు అబద్దాలు చెబుతున్నారని మండిపడుతున్నారు. 2017లో DGCA జారీ చేసిన నిబంధనల ప్రకారం… అలా అర్థంతరంగా విమానం రద్దు చేయడం కుదరదు. చార్టర్ ప్రాతిపదిక పంపాలంటే షెడ్యూల్డ్ ప్యాసింజర్ విమానం కాకుండా వేరేవి పంపాలని రూల్ ఉంది. క్రికెటర్ల కోసం మమ్మల్ని వేధిస్తారా అని ప్రయాణీకులు మండిపడుతున్నారు.