Flipkart: 30 సెకన్లలో రూ. 5లక్షల వరకూ లోన్.. యాక్సెస్ బ్యాంకుతో డీల్ కుదుర్చుకున్న ఫ్లిప్ కార్ట్..

ప్రస్తుత సమాజంలో బ్యాంకులు లోన్లు అందిస్తామంటూ మన ఫోన్ నంబర్ కి కాల్ చేస్తూ ఉంటారు. మన వివరాలు అడిగి తెలుసుకుంటారు. మనకు అవసరమైనంత లోన్లు ఎలిజిబిలిటీ బట్టి అందిస్తూ ఉంటారు. ఈ లోన్ల కోసం కొందరు రకరకాలా యాప్ లను కూడా ఉపయోగిస్తారు. అందులో కొన్ని నకిలీ యాప్ లు ఉంటాయి. వాటి ద్వారా కొందరు మోస పోతూ ఉండటం నిత్యం చూస్తేనే ఉన్నాము. ఇలాంటి వాటికి చెక్ పెడుతూ ఫ్లిప్ కార్ట్ లోన్ తీసుకునే వారికి తీపి కబురు మోసుకొచ్చింది. అదేంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 7, 2023 | 07:45 PMLast Updated on: Jul 07, 2023 | 7:45 PM

Flipkart Is All Set To Partner With Access Bank To Offer Personal Loans And Special Online Offers

యాక్సెస్ బ్యాంకుతో భాగస్వామ్యం..

ఫ్లిప్ కార్ట్ అనేది దిగ్గజ ఈ కామర్స్ సంస్థ. ఆన్లైన్ ద్వారా వస్తువులను కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేసిన ఒక వేదిక. దీని ద్వారా నిత్యం లక్షల్లో ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటారు. ఇంతటి గొప్ప సేవలు అందించే ఈ సంస్థ తాజాగా కొన్ని ఆఫర్లతోపాటూ కోరినంత లోన్ అందించేందుకు యాక్సెస్ బ్యాంకుతో చేతులు కలిపింది. అలాగే పేరొందిన బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకొని ఆయా బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన వారికి ప్రత్యేకమైన బంపర్ ఆఫర్లు ఇచ్చేందుకు సిద్దమైంది.

బంపర్ ఆఫర్లు ఇవే..

అందులో భాగంగా మొదటిది వస్తువులు కొనుగోలు చేసి డబ్బులు మాత్రం నిదానంగా చెల్లించేలా సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. దీనికి ‘బై నౌ పే లేటర్’ అని నామకరణం చేసింది. అంతేకాకుండా ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. వీటి కోసం కో బ్రాండెట్ క్రెడిట్ కార్డులను అందిస్తున్నట్లు ఈ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధీరజ్ అనెజా పేర్కొన్నారు. ఇలా తన యాప్ లో వస్తువులను కొనుగోలు చేసే వారి సంఖ్యను పెంచుకునేందుకు కృషిచేస్తోంది.

30 సెకన్లలో లోన్ ఇలా..

ఈ కామర్స్ రంగంలో పేరొందిన ఈ ఫ్లిప్ కార్ట్ డబ్లులు అవసరం అయిన వారికి 30 సెకన్లలో లోన్ అందించేందుకు ముందుకు వచ్చింది. ఇలా యాక్సెస్ బ్యాంకుతో కుదుర్చుకున్న ఒప్పందం వల్ల దాదాపు 450 మిలియన్ కస్టమర్లు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోబోతున్నట్లు తెలిపింది. ఈ యాప్ ద్వారా గరిష్టంగా రూ. 5 లక్షల వరకూ లోన్ పొందే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ లోన్ ను తిరిగి చెల్లించేందుకు కనిష్టంగా 6 నెలల నుంచి గరిష్టంగా 3 సంవత్సరాల కాల వ్యవధిని ఇవ్వనుంది. ఈ యాప్ ద్వారా లోన్ తీసుకోదలచిన వారు పాన్ కార్డ్ నెంబర్, పుట్టిన తేదీని, పేరు, ఇలాంటి ప్రాథమిక వివరాలు అందించాల్సి ఉంటుంది. మీరు పొందుపరిచిన వివరాలన్నీ సరిగ్గా ఉన్నట్లయితే యాప్ పేజ్ లో ముందుకు వెళతారు. మనం ఇచ్చిన డేటాను బట్టి మనకు ఎంత లోన్ మంజూరు అవుతుంది..? ఎంత లోన్ తీసుకునేందుకు అర్హులు.? వంటి వివరాలను యాక్సెస్ బ్యాంకు ప్రతినిధులు పరిశీలిస్తారు. మీరు లోన్ తీసుకునేందుకు సిద్దంగా ఉన్నట్లయితే తిరిగి లోన్ మొత్తాన్ని ఎలా చెల్లిస్తారు.? నెలకు ఎంత మొత్తంలో చెల్లిస్తారు.? అనే వివరాలను అడుగుతుంది. వీటితో పాటూ లోన్ కాల వ్యవధి మధ్యలోనే కొంత మొత్తాన్ని ముందుగా చెల్లించేందుకు ఒక ఆప్షన్ ను అందిస్తారు. దీంతో మీరు లోన్ తీసుకొని సులభవాయిదాల ద్వారా లేదా గడువు కంటే ముందుగా చెల్లిస్తూ ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకోవచ్చు.

T.V.SRIKAR