Flipkart Offers: దుమ్మురేపే ఆఫర్లతో ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్స్’ తీసుకొస్తున్న ప్లిప్ కార్ట్..

ఇటీవల కాలంలో ఏం కొనాలన్నా అన్నీ ఆన్లైన్లోనే ఆర్డర్ పెడుతున్నారు. అందులో ఎక్కువగా ఉపయోగించే యాప్ లు అమెజాన్, ఫ్లిప్ కార్ట్. ప్రతి ఏటా ఆగస్ట్ లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ రెండు ఈ కామర్స్ వేదికలు వివిధ రకాలా ఆఫర్లను ప్రకటిస్తాయి. తాజాగా ఫ్లిప్ కార్ట్ అద్భుతమైన డిస్కౌంట్ అందించేందుకు మీ ముందుకు రానుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 1, 2023 | 03:36 PMLast Updated on: Aug 01, 2023 | 3:36 PM

Flipkart Is Bringing Offers In The Name Of Big Saving Days Sales In The First Week Of August

బిగ్ సేవింగ్ డేస్ సేల్స్ పేరుతో ఆగస్ట్ 4 నుంచి 9 వరకు ఐదు రోజుల పాటూ ఈ సేల్స్ కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా స్మార్ట్ ఫోన్, లాప్ టాప్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇంటీరియర్, కిచెన్ ఐటెమ్స్ పై భారీ డిస్కౌంట్లు అందించనున్నట్లు తెలుస్తుంది. ప్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్ షిప్ కలిగిన యూజర్లకు ఒకరోజు ముందుగానే ఈ సేల్స్ ప్రారంభమౌతాయని కంపెనీ ప్రకటించింది.

ఈనెల 4 మధ్యాహ్నం 12 గంటల నుంచి 9 వ తేది మధ్యాహ్నం 12 వరకూ ఈ సేల్స్ తెరిచి ‎ఉంటుంది. ఇందులో రకరకాలా క్రెడిట్, డెబిట్ కార్డులు, ఈఎంఐ వెసులుబాటుతో వస్తువులు కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు జరిపితే 10 శాతం రాయితీ పొందవచ్చు. అలాగే ప్లిప్ కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డు దారులు 5 శాతం డిస్కౌంట్ అందనున్నట్లు ప్రకటించింది. ఇక ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ సూపర్‌ ఎలైట్‌ కార్డ్‌ ద్వారా లావాదేవీలు జరిపితే బోనస్ పాయింట్స్ వస్తాయి. వీటితో పాటూ క్రేజీ డీల్స్ అనే పేరుతో రోజులో మూడు సార్లు స్పెషల్ ఆఫర్లు ఇవ్వనుంది. అర్థరాత్రి 12 గంటలకు, ఉదయం 8 కి, సాయంత్రం 4 గంటలకు కొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. ఫోర్ అవర్ డీల్స్ సేల్స్ లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 వరకూ ప్రత్యేకమైన ఆఫర్లు, డిస్కౌంట్లు అందించనున్నట్లు తెలిపింది.

ఏ ఏ వస్తువులపై ఎంత డిస్కౌంట్..

  • ఎలక్ట్రానిక్, ఫర్నీచర్, వస్త్రాలపై 80శాతం డిస్కౌంట్
  • టీవీ, ఏసీ, ఫ్రిజ్ లపై 75శాతం డిస్కౌంట్
  • బ్యూటీ, ఫుడ్, టాయ్స్ పై 85 శాతం వరకూ రాయితీ లభిస్తుంది

సాధారణంగా ఇలాంటి ఆఫర్లను అమెజాన్ ముందుగా తీసుకువస్తుంది. కానీ ప్లిప్ కార్ట్ ఈసారి ఒక అడుగు ముందుకు వేసి ఆగస్ట్ తొలివారంలోనే తీసుకురావడం గమనార్హం.

T.V.SRIKAR